
నిధి దొరికిన తర్వాత కుటుంబసభ్యులు దాన్ని జిల్లా అధికారులకు మనస్ఫూర్తిగా అప్పగించారు. బంగారం తిరిగి ఇవ్వడానికి ఎలాంటి పేచీ పెట్టలేదు. ఆ బంగారం వారి పూర్వీకులది అని తేలటంతో వారు దాన్ని తిరిగి అడుగుతున్నారు. గ్రామస్థులు కూడా బంగారాన్ని కుటుంబసభ్యులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పురావస్తు శాఖ అధికారుల స్టేట్మెంట్ నేపథ్యంలో జిల్లా అధికారులు ఆ బంగారాన్ని కుటుంబసభ్యులకు తిరిగి ఇస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులూ ఎంతో ఆసక్తిగా నిధి వెనక్కు వస్తుందా? లేదా అని ఎదురుచూస్తూ ఉన్నారు.లక్కుండి గ్రామంలో ఇంటి కోసం పునాది తీస్తుండగా గుప్తనిధి బయటపడింద. గంగవ్వ బసవరాజ్ రిత్తి ఇంటి స్థలంలో నిధి దొరికింది. ఓ కుండలో శతాబ్దాల కాలం నాటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లంకె బిందెల్లో గిన్నెలతో పాటు బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. అవి దాదాపు ఒక కిలో బరువు ఉన్నట్లు చెబుతున్నారు. సాధారణంగా ఇలా దొరికిన వస్తువులు ప్రభుత్వానికే చెందుతాయి. కానీ ఆ బంగారం.. ఇంటి పూర్వీకులదేనని తేలడంతో ఆ పుత్తడిని కుటుంబసభ్యులకు తిరిగి ఇస్తారా? లేదా? అనే ఆసక్తి నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం :
