
శాన్వి శ్రీవాస్తవ మోడల్ ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. ఈ అమ్మడు ఎక్కువగా కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ డిసెంబర్ 8, 1993న వారణాసిలో జన్మించింది. శాన్వి తన నటనా జీవితాన్ని 2012లో “లవ్లీ” చిత్రంతో ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె ఇంకా చదువుతోంది.
తెలుగులో లవ్లీ సినిమా తర్వాత “అడ్డా” (2013) , “రౌడీ” (2014) వంటి చిత్రాల్లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. శాన్వి ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌లో తన బి.కామ్ డిగ్రీని పూర్తి చేసింది.
కన్నడ సినిమాలైన “మాస్టర్‌పీస్” (2015), “తారక్” (2017), “ముఫ్తీ” (2017), మరియు “అవనే శ్రీమన్నారాయణ” (2019) వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆమె “మాస్టర్‌పీస్” చిత్రానికి SIIMA క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ (కన్నడ) “తారక్” చిత్రానికి SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ (కన్నడ) గెలుచుకుంది.
ఈ బ్యూటీ చేసింది తెలుగులో నాలుగు సినిమాలే.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కొన్ని సినిమాల్లో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. కానీ చేసిన సినిమాల్లో మొదటి సినిమా తప్ప మిగిలినవి అన్ని ఫ్లాప్ అయ్యాయి.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కొత్త సినిమాలు అనౌన్స్ చేయకపోయినా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటుంది శాన్వి.