
హిందూ పురాణాల ప్రకారం, సముద్ర మథనం సందర్భంగా జనించిన హాలాహలాన్ని పరమశివుడు స్వీకరించి గరళ కంఠుడిగా మరాడు. ఇక సముద్రగర్భం నుంచి ఉద్భవించిన అమృతభాండం నుంచి చిలికిన బిందులు త్రివేణీ సంగమంలో పడ్డాయని భక్తులు నమ్ముతారు. హరహర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతోంది ప్రయాగ్‌రాజ్. శివరాత్రి పర్వదినం కావడంతో త్రివేణి సంగమ ఘాట్లు భక్తులతో కిక్కిరుస్తున్నాయి. ఇవాళ చివరి రోజు అమృత స్నానం… అందులోనూ శివరాత్రి కావడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. ప్రయాగ్‌రాజ్ ప్రాంగణాన్ని ‘నో వెహికల్ జోన్’గా ఇప్పటికే ప్రకటించారు. ఇక కుంభమేళా ముగిసిన అనంతరం భక్తులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేలా రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రయాగ్‌రాజ్ నుంచి 350 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇక చివరి రోజున భక్త జన సందోహం పోటెత్తే అవకాశం ఉండటంతో ప్రయాగ్‌రాజ్‌లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రంతా అధికారులు హైలర్ట్‌లో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పంటి నొప్పితో ఆస్పత్రికొచ్చి ప్రాణాలు కోల్పోయింది.. డాక్టర్లు CT స్కాన్ చేయగా
మస్క్ కాళ్లను ట్రంప్ పట్టుకున్నట్టుగా వీడియో.. అమెరికా ప్రభుత్వ కార్యాలయంలో టెలికాస్ట్.. చివరకు..
అయ్యో.. ఆ బంగారు టాయిలెట్‌ను దొంగలు దోచుకెళ్లారు!వీడియో