
చోరీ చేసిన ఇంధనాన్ని విడిగా విక్రయించే చిరు వ్యాపారులకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదోని వన్ టౌన్ పరిధిలోని ఓ పార్కింగ్ స్థలంలో మార్చి 23, ఏప్రిల్ 8 తేదీల్లో పార్క్ చేసి ఉన్న లారీల్లో సుమారు 5000 లీటర్ల డీజిల్ చోరీ జరిగింది. బాధితులు ఏప్రిల్ 8వ తేదీన వన్ టౌన్ పీఎస్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న డిఎస్పి హేమలత ఒకటో పట్టణం సిఐ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేటలో నిందితులను గుర్తించి 11 మందిని అదుపులోకి తీసుకొని విచారించగా దాదాపు 10,600 లీటర్ల డీజిల్‌ను దొంగిలించినట్లు తెలియింది. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు. నిందితుల వద్ద నుండి 10,30,000 నగదు, 4 కార్లు, 350 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :