
సమతుల్య ఆహారంతో పాటు, సమతుల్య నిద్ర కూడా మానవునికి చాలా ముఖ్యం. ఒకరు సరిగ్గా నిద్రపోకపోతే, అది అతని శరీరం, మనస్సును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కానీ, ఈ మనిషి వైద్య ప్రపంచానికి ఒక సవాలుగా మారాడు. సరిగ్గా 50 సంవత్సరాలు నిద్రపోకుండా మనిషి ఎలా జీవించగలడనే ప్రశ్న వైద్యులకు తలెత్తింది. ఈ ఆశ్చర్యకరమైన కేసు మధ్యప్రదేశ్‌లోని రేవాలో వెలుగులోకి వచ్చింది.
ఈ అద్భుత పురుషుడు మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలోని చాణుక్యపురి కాలనీ నివాసి. అతను నిద్రపోకుండా బతికే ఉన్నాడని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రాత్రంతా నిద్రపోలేనని అతను ఎవరితోనూ చెప్పలేదు. అయితే, అతని కళ్ళు మండడం లేదు, అది అతని పనిని ప్రభావితం చేయలేదు. దీని గురించి అతను తన కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు, వారు మొదట అతనికి భూతవైద్యం చేయించారు.అయితే, అవేవీ పని చేయకపోవడంతో అతను ఢిల్లీ, ముంబైలోని ప్రముఖ ఆసుపత్రులలోని వైద్యులను సంప్రదించాడు. అన్ని రకాల టెస్ట్‌లు చేసిన డాక్టర్లకు కూడా అతని నిద్రలేమికి కారణం ఏంటో అస్పష్టంగానే ఉంది.
ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటంటే.. అతను నిద్రపోకపోయినా ఏ వ్యాధితోనూ బాధపడలేదు. ఇంత కాలం నిద్రలేమి ఉన్నప్పటికీ, అతను ఎలాంటి తీవ్రమైన వ్యాధులతో గురికాలేదు. అతను అందరిలాగే సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. అవును, మోహన్ లాల్ ద్వివేది 1973లో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1974లో, అతను MPPSCలో ఉత్తీర్ణుడై నయాబ్ తహశీల్దార్ అయ్యాడు. 1973 ప్రాంతంలో అతనికి నిద్రలేమి సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుండి, అతను నిద్రలేమితో బాధపడుతున్నాడు. ఇప్పుడు, అతను ఎక్కువ సమయం పుస్తకాలు చదువుతూ గడుపుతాడు. అతను రాత్రిపూట టెర్రస్‌పై నడుస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా..? అని ఎదురు చూస్తుంటాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…
