
ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ కోసం కాస్త గ్యాప్ ఇచ్చిన శ్రీలీల.. ఇకపై నో గ్యాప్ అంటున్నారు. వరస సినిమాతో కమ్‌బ్యాక్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. ప్రస్తుతం రాబిన్ హుడ్‌తో మార్చి 28న వస్తున్నారు శ్రీలీల.
అలాగే రవితేజ మాస్ జాతర, అఖిల్ సినిమా, శివకార్తికేయన్ పరాశక్తి, కార్తిక్ ఆర్యన్ ఆషికీ 3 లాంటి సినిమాలతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్‌కు రెడీ అయ్యారు శ్రీలీల.
మిస్టర్ బచ్చన్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన భాగ్యశ్రీ బోర్సే సైతం కెరీర్‌ను మార్చేస హిట్ కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్ డమ్.. దుల్కర్ సల్మాన్ కాంతా.. రామ్‌తో ఓ సినిమా చేస్తున్నారు భాగ్య శ్రీ బోర్సే. వీటితోనే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఈ బ్యూటీ. ఇక ఓదెల 2తో తమన్నా ఏప్రిల్ 17న రానున్నారు.
కొన్నేళ్లుగా తెలుగులో సరైన హిట్ లేని తమన్నాకు ఓదెల 2 కీలకంగా మారింది. కేజియఫ్ తర్వాత శ్రీనిధి శెట్టి పేరు మార్మోగిపోయింది. కానీ ఆ తర్వాత ఆమె సీన్లో కూడా కనబడలేదు.
ప్రస్తుతం నాని హిట్ 3లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ సినిమాతో కమ్‌బ్యాక్ కోసం ట్రై చేస్తున్నారు శ్రీనిధి. అలాగే నిధి అగర్వాల్ ఆశలన్నీ మే 9న రాబోయే హరిహర వీరమల్లుపైనే ఉన్నాయి.