
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక నిర్ణయం వివాదాస్పదంగా మారింది. అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ రియాన్ పరాగ్‌ను అవుట్ చేయడంతో వివాదం తలెత్తింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లోని ఏడో ఓవర్లో రియాన్ పరాగ్‌ను అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో.. ఈ వివాదాస్పద నిర్ణయం వెలుగులోకి వచ్చింది. సమీక్ష తీసుకున్న తర్వాత కూడా, థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చలేదు. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏప్రిల్ 9వ తేదీ బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేసి 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీనికి ప్రతిస్పందనగా, రాజస్థాన్ తన రెండు వికెట్లను త్వరగా కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ వచ్చిన వెంటనే గుజరాత్ బౌలర్లపై దాడికి దిగాడు. అతని బ్యాట్ నుంచి కొన్ని అద్భుతమైన షాట్లు వచ్చాయి. అవి రాజస్థాన్ స్కోరును ముందుకు తీసుకెళ్లాయి.
అంపైర్ ఔట్ ఇచ్చాడు.. DRS తీసుకున్నా నో యూస్..
DRAMA IN AHMEDABAD! 👀😯
Riyan Parag is not happy with the DRS decision for being caught behind & he makes his way back! What is your take here? 👀
Watch the LIVE action ➡ https://t.co/Bu2uqHSFdi #IPLonJioStar 👉 #GTvRR | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi &… pic.twitter.com/iy9BedHrtz
— Star Sports (@StarSportsIndia) April 9, 2025
రాజస్థాన్ ఇన్నింగ్స్ ఏడవ ఓవర్లో ఇలా జరిగింది. ఈ ఓవర్లో లెఫ్టార్మ్ పేసర్ కుల్వంత్ ఖేజ్రోలియా బౌలింగ్ చేస్తున్నాడు. అతని నాలుగో బంతి దాదాపు యార్కర్‌గా సంధించాడు. దీనిని రియాన్ థర్డ్ మ్యాన్ వైపు ఆడాలనుకున్నాడు. కానీ, అతని బ్యాట్ కింద పడగానే, బంతి దగ్గరగా వెళ్లి వికెట్ కీపర్ చేతికి చిక్కింది. అంపైర్ దానిని అవుట్‌గా ప్రకటించాడు. కానీ, రియాన్ దీనిపై DRS సహాయం తీసుకున్నాడు. బంతి బ్యాట్‌కు దగ్గరగా ఉంది. అదే సమయంలో బ్యాట్ కూడా పిచ్‌ను బలంగా తాకింది.
థర్డ్ అంపైర్ నుంచి ఎలాంటి మార్పులేదు..
థర్డ్ అంపైర్ రీప్లే చూసినప్పుడు, బ్యాట్ ముందుగా పిచ్‌ను తాకిందని, దాని శబ్దం స్నికోమీటర్లో వినిపించిందని స్పష్టంగా కనిపించింది. కానీ, తరువాతి ఫ్రేమ్‌లో, బంతి బ్యాట్‌ను దాటుతున్నట్లు కనిపించిన వెంటనే, స్నికోమీటర్లోని శబ్దం బిగ్గరగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, థర్డ్ అంపైర్ రియాన్ పరాగ్‌ను అవుట్‌గా ప్రకటించాడు. కానీ, రియాన్ పరాగ్ ఏమాత్రం సంతోషంగా కనిపించలేదు. నేరుగా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అతని చర్యను చూసిన ఇతర అంపైర్ అక్కడికి చేరుకుని ర్యాన్‌ను నేరుగా పెవిలియన్‌కు తిరిగి రమ్మని కోరాడు. అంపైర్లపై అసహనం వ్యక్తి చేసిన రియాన్ పెవిలియన్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..