
ఉజ్జయిని, మార్చి 18: కూతురు ప్రియుడితో వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తమ అభిష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుందనీ.. కూతురు బతికుండగానే ఊరంతా పిలిచి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి పిండం పెట్టాడు ఆ తండ్రి. తమ కూతురు చనిపోయినట్లు ఊరంతా పోస్టర్లు అతికింది నానాహంగామా చేశాడు. అంతేనా కుటుంబ సభ్యులంతా గుండు చేయించుకుని, ఊరంతా శాంతి విందు భోజనాలు కూడా పెట్టాడు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖచ్రోడ్ ప్రాంతంలోని ఉజ్జయినిలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..
ఖచ్రోడ్ తహసీల్‌లోని గుదావన్ గ్రామానికి చెందిన వర్దిరామ్ గర్గమ కుమార్తె మేఘ గర్గమ.. కొన్ని రోజుల క్రితం తన ప్రియుడు దీపక్‌తో ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకుంది. దీంతో మేఘ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు గాలించి మేఘను, ఆమె ప్రియుడు దీపక్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం మేఘ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. వారు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే పోలీసులు మేఘను తమ కుటుంబాన్ని గుర్తించమని అడిగగా.. కానీ ఆమె వారిని గుర్తించడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన మేఘ తల్లిదండ్రులు తమ కుమార్తె ఈ క్షణం నుంచి చనిపోయినట్లేనని చెప్పారు. అంతటితో ఆగకుండా కుమార్తె మేఘ గోర్ని సంతాప కార్డులను ముద్రించి ఊరంతా పంచిపెట్టారు. ఊరంతా పిలిచి ఆచారాల ప్రకారం పిండ దానాన్ని నిర్వహించడం ద్వారా శాంతి విందును ఏర్పాటు చేశారు.
నేటి సమాజంలోని పిల్లలు ఆధునికతను విధ్వంసానికి ఒక సాధనంగా మార్చుకుంటున్నారని మేఘ తండ్రి తన బాధను సంతాప లేఖలో ముద్రించాడు. ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను దుర్వినియోగం, తల్లిదండ్రుల ప్రేమను బలహీనతగా అర్ధం చేసుకుని, సమాజం – కుటుంబం గౌరవాన్ని పట్టించుకోకుండా పిల్లలు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. ఇది నేటి కాలంలో ట్రెండ్‌గా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నేటి సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయయని సంతాప లేఖలో మేఘ తండ్రి తెలిపారు. తన కుమార్తె పారిపోయి దీపక్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుందని, తమ గౌరవాన్ని లెక్క చేయని కుమార్తె మేఘ 15 మార్చి 2025 శనివారం మరణించిందని సంతాప లేఖలో ముద్రించి బంధుజనాలకు, ఊరి జనాలకు పంచిపెట్టాడు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.