ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.ఇంత ఎండల్లో చిన్నారులను బయటకు పంపించడం కరెక్ట్ కాదనే అభిప్రాయం తల్లిదండ్రుల నుంచి కూడా వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో 35 డిగ్రీల నుండి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎండల ధాటికి ఆరోగ్య సమస్యలు తప్పవని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం, అతి త్వరలో ఒంటి పూట బడులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.మార్చి 1 నుంచి ఒంటి పూట బడులు పెడితే, విద్యార్థులకు ఎండల తీవ్రత నుండి ఊరట లభిస్తుందని విద్యార్థి సంఘాలు సూచిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మార్చి మొదటి వారం తర్వాతే అంటే.. మార్చి 10వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించే యోచనలో ఉంది.
