
ఐపీఎల్ 2025 కోసం అన్ని టీమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఓ టీమ్ మాత్రం పూజలు చేస్తోంది. అది కూడా ఏ సాధారణ పూజలు కాదు.. పెద్ద పెద్ద హోమాల రేంజ్లో చేస్తున్నారు. ఆ పూజలు చూస్తే ప్రత్యర్థులు కూడా భయపడి వారితో మ్యాచ్‌లు ఓడిపోయేలా ఉన్నాయి. ఇంతకీ ఆ పూజలు చేస్తున్న టీమ్ ఏది? పూజలు ఎవరు కూర్చున్నారో ఇప్పుడు చూద్దాం..
పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ పుట్టినప్పటి నుంచి ఆడుతన్నా.. ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. వారితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ కూడా కప్పు కొట్టకపోయినా.. వాళ్లకున్నంత ఫ్యాన్ బేస్ కూడా పంజాబ్‌కు లేదని చెప్పు కోవచ్చు. ట్రోఫీ గెలిచేందుకు వాళ్లు చాలా సార్లు టీమ్‌లను మార్చేశారు. కెప్టెన్లను ఎన్ని సార్లు మార్చారో లెక్కేలేదు.
అలాగే అనేక సార్లు జెర్సీలు, జెర్సీ రంగులు, లోగోలు ఏకంగా టీమ్ పేరు కూడా మార్చుకున్నారు. ఎన్ని మార్చినా, ఏం చేసినా వాళ్లకు కప్పు మాత్రం రాలేదు. అయితే ఈ సారి మాత్రం కప్పు కచ్చితంగా కొట్టాలనే ఉద్దేశంతో ఏకంగా భారీ భారీ పూజలు కూడా చేస్తున్నారు.
అయితే ఈ పూజలో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లతో పాటు ఆ జట్టు హెడ్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పాల్గొన్నాడు. అక్కడున్న పూజారులు పూజలు చేయిస్తుంటే.. ఆయన పూజలో పాల్గొన్నారు. ఈ పూజలు చూస్తుంటే ఈ సారి కప్పు పంజాబ్ కొట్టేలా ఉందని అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
మరి ఈ పూజలు పంజాబ్ కింగ్స్‌కు ఎంత వరకు కలిసి వస్తాయో, వారికి మొదటి ఐపీఎల్ ట్రోఫీని అందిస్తాయో లేదో చూడాలి. ఇక పోతే పంజాబ్ కింగ్స్ టీమ్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఓవరాల్‌గా పంజాబ్ టీమ్ కూడా బాగుంది.