
IPL 2025లో ఏప్రిల్ 12న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ మరోసారి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఈ సీజన్లో నికోలస్ పూరన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతడు 6 మ్యాచ్‌ల్లో 4 అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లలో 31 సిక్సర్లు, 24 ఫోర్లతో 349 పరుగులు చేశాడు. ఇంతటి అద్భుత ప్రదర్శన ఇస్తోన్న పూరన్.. తన విజయరహస్యం ఏంటో వివరించాడు. దాని వల్లే తాను ఫిట్‌గా ఉంటానని, లాంగ్ సిక్సర్లు కొట్టగలనని చెప్పాడు.
ఈ వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం తన బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూలో, లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్.. తన డైట్ ఏంటని నికోలస్ పూరన్‌ను అడగ్గా.. తాను నల్ల పప్పు, చికెన్, రైస్ తింటానని చెప్పాడు. అది నన్ను ఫిట్‌గా ఉంచుతుందని, లాంగ్ సిక్సర్లు కొట్టగలనని చెప్పాడు. అలాగే రోజులో చాలాసేపు ప్రాక్టీస్ చేస్తానని తెలిపాడు.
LSGకి చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు 6 మ్యాచ్‌ల్లో 69.80 సగటుతో మొత్తం 349 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో, అతడు 31 సిక్సర్లు, 29 ఫోర్లు కొట్టాడు. ఇది కాకుండా, ఐపీఎల్లో సిక్సర్ల విషయంలో యువరాజ్ సింగ్‌ను అధిగమించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నికోలస్ పూరన్ ఐపీఎల్లో 150 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో పూరన్ 82 మ్యాచ్‌ల్లో 79 ఇన్నింగ్స్‌ల్లో 158 సిక్సర్లు కొట్టాడు. కాగా, భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్లో 149 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్లో 132 మ్యాచ్‌ల్లో యువరాజ్ 149 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 200 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో క్రిస్ గేల్ ముందంజలో ఉన్నాడు. 142 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్లో 282 సిక్సర్లతో రోహిత్ శర్మ రెండవ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 278 సిక్సర్లు కొట్టగా, మహేంద్ర సింగ్ ధోనీ 259 సిక్సర్లు, ఏబీ డివిలియర్స్ 251 సిక్సర్లు బాదాడు.
మరోవైపు 2015లో రెండు కాళ్లకు యాక్సిడెంట్ అయ్యి.. సంవత్సరం పాటు బెడ్‌పైనే ఉన్నాడు నికోలస్ పూరన్. ఆ సమయంలో డాక్టర్లు అతడు ఇక క్రికెట్ ఆడలేదు అని చెప్పాడు. అలాగే సన్‌రైజర్స్ ఈ ప్లేయర్‌ను కొనుగోలు చేయగా.. సరిగ్గా ఆడకపోయేసరికి వదిలిపెట్టింది. ఇక ఆ నెక్స్ట్ నుంచి నికోలస్ పూరన్ రెచ్చిపోయి మరీ ఆడాడు. సిక్సర్ల హిట్టింగ్‌లో ముందు వరుసలో ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..