
ఏనుగును దగ్గరనుంచి చూసేందుకు ప్రయత్నించి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వ్యక్తి. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని మైసూర్ రోడ్డు పై జరిగింది. ఇద్దరు వ్యక్తులు కారులో వెళుతుండగా వారికి ఏనుగు కనిపించింది. దీంతో కారు దిగి దానిని దగ్గర నుంచి చూసేందుకు వెళ్ళారు. ఇంకేముంది ఆ ఏనుగు వారితో ఓ ఆట ఆడేసుకుంది. ఉన్నట్టుండి వారిని వెంబడించింది. దాంతో బతుకు జీవుడా అంటూ ఆ ఇద్దరు ప్రాణాలు అరి చేతుల్లో పెట్టుకొని పరుగు అందుకున్నారు. ఒక అతను పరుగెత్తలేక కిందపడిపోయాడు. ఏనుగు అతన్ని తన వెనుక కాళ్ళతో తన్ని వదిలి పెట్టింది. ఎందుకో అతని మీద దయతలచి తొక్కకుండా వదిలి పెట్టింది. దెబ్బకు బతుకు జీవుడా అంటూ అక్కడినుంచి పాకుతూ వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఏనుగు బతుకు పో మరోసారి నాతో ఆటలాడా లని ప్రయత్నిస్తే మామూలుగా ఉండదని అన్నట్టుగా అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.