

ఏఐ రాకతో రాబోయే దశాబ్ద కాలంలో వీరికి ఉండే జ్ఞానం ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మన జనాభాకు సరిపడా వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత ఉంది. దీంతో ఏఐతో లభించే మెడికల్ సలహాలు, టీచింగ్ క్లాసులు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాల సంగతి ఏంటి? కనీసం వారానికి రెండు మూడు రోజులైనా పని చేయగలమా అని బిల్ గేట్స్ అన్నారు. అయితే కొన్ని రకాల సమస్యలను ఏఐ పరిష్కరించడమే కాకుండా కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయని, పనులు వేగంగా పూర్తవుతున్నాయని బిల్ గేట్స్ చెప్పారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏఐ మరింత వేగంగా అందుబాటులోకి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆటోమేషన్ కు అడ్వాన్స్డ్ వెర్షన్. ఉన్నత స్థాయి మేధోపరంగాను అనేక పనులు చేస్తుంది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలపర్లు చేసే 70 శాతం పనులను ఏఐ చేయగలదు. టాలెంటెడ్ ఉద్యోగుల జీతభత్యాలపై ఏఐ ఎఫెక్ట్ పడుతుంది. ఏఐ వినియోగం పెరిగితే చాలా ఉద్యోగాలు గల్లంతే. వందేళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితి రావచ్చు. ఉద్యోగం, కుటుంబ పోషణ వంటి సమస్యలు తలెత్తుతాయని ఒబామా పేర్కొన్నారు. అయితే బిల్ గేట్స్ ఒబామా అభిప్రాయాలపై సోషల్ మీడియాలో నెటిజెన్స్ తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇలాంటి భవిష్యత్తు అనేది మనం కోరుకునేది విద్య, ఆరోగ్య రంగాల్లో మనిషి ప్రతిభను మెషీన్లు భర్తీ చేయగలవా అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అంశమని ఆందోళన చెందుతున్నారు.