
ఇప్పుడున్న చాలా మంది హీరో, హీరోయిన్స్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా చేసిన వారే.. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ప్రేక్షకులకు దగ్గరైన వారు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసి ఇప్పుడు హీరోయిన్స్ గా మారిపోయారు చాలా మందు ముద్దుగుమ్మలు. యంగ్ బ్యూటీస్ తమ అందచందాలతో కుర్రాళ్లను తెగ కవ్విస్తున్నారు. పైన కనిపిస్తున్న హాట్ భామ కూడా ఆకోవకు చెందిందే.. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. 24 సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. పేరుకే చైల్డ్ ఆర్టిస్ట్ కానీ హీరోయిన్స్ మించిన క్రేజ్.. అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనుకాడదు ఈ చిన్నది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? ఆమె తెలుగులో చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇంతకూ ఆమె ఎవరంటే
ఇది కూడా చదవండి :అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు.. ఎమోష్నలైన స్టార్ హీరోయిన్
పై ఫొటోలో ఎర్ర కోకలో కాక రేపుతున్న బ్యూటీ ఎవరో కాదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ ఎస్తర్ అనిల్. దృశ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఎస్తర్ ఆగస్టు 27, 2001న కేరళలోని వయనాడ్‌లో జన్మించింది. ఎస్తర్ తన సినీ జీవితాన్ని 2010లో మలయాళ చిత్రం “నల్లవన్” ద్వారా బాల నటిగా ప్రారంభించింది. 2013లో జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన “దృశ్యం” చిత్రంలో అనుమోల్ జార్జ్ (అను) పాత్రలో నటించి ఆమె విశేష గుర్తింపు పొందింది. ఈ చిత్రం మలయాళంలోనే కాకుండా తెలుగునూ రీమేక్ అయ్యింది.
ఇది కూడా చదవండి :ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో.. అన్ని సినిమాలు హిట్టే
వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ అయిన దృశ్యం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే దృశ్యం2 సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు 24 సినిమాల్లో నటించింది. అలాగే ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది ఈ అమ్మడు. ఎస్తర్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటో షూట్లు, సినిమా అప్డేట్లు, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకుంటుంది. ఆమె ఫ్యాషన్ సెన్స్ అభిమానులను ఆకర్షిస్తుంది. అలాగే ఈ అమ్మడు తన అందాలతో కుర్రకారును కవ్విస్తుంది.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి రచ్చ మావ..! చేసింది చిన్న పాత్ర.. ఓవర్ నైట్‌లో స్టార్ డమ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.