
ఓ విదేశీ ప్రయాణికుడు దర్జాగా విమానం దిగి.. ఇండియాలోకి ఎంటర్ అవుతున్నాడు. కానీ, అతనెందుకో కాస్త తేడా తేడా కనిపిస్తుండటంతో ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు ఆపి చెక్ చేయగా.. వాళ్ల అనుమానం నిజమైంది. అతని కడుపులో భారీగా డ్రగ్స్ దొరికాయి. ఈ షాకింగ్ ఘటన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం.. ఏప్రిల్ 9న UR430 విమానంలో ఓ విదేశీ ప్రయాణికుడు ముంబై చేరుకున్నాడు.
అతన్ని చెకింగ్ పాయింట్లో కస్టమ్స్ అధికారులు ఆపి ప్రశ్నించగా, భయం భయంగా కనిపించాడు. తదుపరి తనిఖీలు నిర్వహించగా ప్రయాణీకుడు పసుపు రంగు గుళికలను మింగినట్లు తేలింది. వాటిలో కొకైన్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు అతని కడుపులో 785 గ్రాముల నికర బరువు కలిగిన కొకైన్ కనిపెట్టినట్లు వెల్లడించారు. దీని విలువ సుమారు రూ. 7.85 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణీకుడిని NDPS చట్టం కింద అరెస్టు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.