

కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పని చేసే ఉద్యోగులు టార్గెట్లు పూర్తి చేయలేదని, వారి మెడలో బెల్ట్ కట్టి కుక్కల్లా నడిపిస్తూ అవమానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యోగులను మరీ ఇంతలా హింసిస్తారా? అంటూ మండిపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ కూడా చేపట్టారు. తాజాగా ఈ కేసులో భారీ ట్విస్ట్ బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు టార్గెట్లు రీచ్ కాలేదని అలా చేయలేదని, ఆ కంపెనీలో గతంలో పనిచేసిన ఓ మేనేజర్‌కు కంపెనీ ఓనర్‌తో విబేధాలు ఉన్నాయి. అతను ఎలాగైనా తన యాజమానిని ఇబ్బంది పెట్టాలని అనుకున్నాడు. నాలుగు నెలల క్రితం కంపెనీలో జాయిన్ అయిన ట్రైనీ ఉద్యోగులను ట్రైనింగ్ పేరుతో ఇలా బట్టలు విప్పించి, కుక్కల్లా మెడలో బెల్ట్ కట్టి, వారిని కుక్కల్లా నడిపించాడు. ఫన్ యాక్టివిటీలో భాగంగా ఇలా చేస్తున్నామంటూ ఉద్యోగులను నమ్మించాడు. సరదాగా చేస్తున్న వాటిని వారికి తెలియకుండా వీడియో తీసి.. ఇప్పుడు కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత.. కంపెనీ పరువు తీసేందుకు వాటిని సోషల్ మీడియాలో పెట్టి, ఉద్యోగులను కంపెనీ ఇలా వేధిస్తోందంటూ ప్రచారం చేశాడు.
నిజానికి కంపెనీలో టార్గెట్ల కోసం ఉద్యోగులను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదని, ఆ వీడియోలో ఉన్న ఓ వ్యక్తి పోలీసులు వెల్లడించాడు. తాను ఇంకా ఆ కంపెనీలోనే పనిచేస్తున్నానని, ఆ రోజు పాత మేనేజర్ చేయించిన విషయాన్ని అతను పోలీసులకు వెల్లడించాడు. దీంతో.. పోలీసులు పాత మేనేజర్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ సంఘటన కలూర్ సమీపంలోని పెరుంబవూర్‌లో ఒక ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.