
జీలకర్ర, వాము, సోంపు పౌడర్ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఇది అనేక అనారోగ్య సమస్యలకు సహజసిద్ధమైన హోమ్ రెమిడీగా పనిచేస్తుంది. ఇది కడుపు, జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తరిమి కొడుతుంది. వాము, జీలకర్ర, సోంపు పౌడర్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఎంజైమ్ యాక్టివ్ అవుతుంది. ప్రేవుల్లోని ఆహారం సరిగ్గా జీర్ణమౌతుంది. ఫలితంగా కడుపు తేలికగా, శుభ్రంగా అవుతుంది. అజీర్తి, మలబద్ధకం సమస్య దూరమౌతుంది. ఈ డ్రింక్‌ని తాగితే అజీర్ణం తగ్గుతుంది. బరువు తగ్గుతారు. ఆపానవాయువు దూరమవుతుంది నిద్ర సమస్యలు దూరమవుతాయి.
వాము, జీలకర్ర, సోంపు పౌడర్ కలిపి మరిగించిన నీటిని తాగటం వల్ల గ్యాస్ ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అజీర్తి సమస్యను ఇట్టే దూరం చేస్తుంది. ఈ పౌడర్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఇమ్యూనిటీని అందిస్తాయి. జీలకర్ర, సోంపులో జింక్, ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పౌడర్ క్రమం తప్పకుండా సేవించం వల్ల మెటబోలిజం వేగవంతమౌతుది. శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తుంది.
జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని కొవ్వుని తగ్గిస్తాయి. జీలకర్రలో థర్మోజెనిక్ గుణాలు శరీర ఉష్ణోగ్రతని పెంచి జీవక్రియ రేటుని పెంచుతుంది. జీలకర్ర జీర్ణవ్యవస్థని బలంగా చేస్తుంది. ఇది అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది. సోంపులో కేలరీలు తక్కువగా, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో మూత్ర విసర్జన లక్షణాలు ఉన్నాయి. ఆకలిని కంట్రోల్ చేస్తుంది. బాడీలో నీరు నిలుపుదలని తగ్గిస్తుంది. జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. శక్తిని పెంచుతుంది.
ఇవి కూడా చదవండి
వాములో కాల్షియం, ఐరన్, పైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని పోషకాలను గ్రహించడంలో సాయపడుతుంది. కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. ప్రేగులని క్లీన్ చేస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున జీలకర్ర, వాము, సోంపుతో మరిగించిన హెర్బల్ టీ తాగితే ఒకటి కాదు రెండు కాదు అనేక వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..