
సంఖ్యాశాస్త్రం అనేది పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని అంచనా వేసే శాస్త్రం. ప్రతి ఒక్కరి పుట్టిన తేదీలోని జన్మ సంఖ్యలను కలిపి వచ్చే సంఖ్యను మూలసంఖ్య అని అంటారు. ఈ మూలసంఖ్య మన స్వభావాన్ని, అభిరుచులను, ఆలోచనల తీరును తెలియజేస్తుంది. మన జీవితంలో వచ్చే పరిణామాలపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. కొన్ని ప్రత్యేకమైన మూలసంఖ్యలకి చెందిన అమ్మాయిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూలసంఖ్యలకు చెందిన వారు ఇతరుల కంటే చాలా తెలివిగలవారు, చురుకైన వారు. ముఖ్యంగా తమ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం, వారిని తమ వైపుకు ఆకర్షించడం వీరి శక్తిగా చెప్పవచ్చు.
మూలసంఖ్య 5
5, 14 లేదా 23 తేదీల్లో జన్మించిన వారికి మూలసంఖ్య 5గా పరిగణిస్తారు. ఈ సంఖ్యను బుధుడు నియంత్రిస్తాడు. బుధుడు తెలివి, చతురత, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ప్రతీక. అతని ప్రభావం వల్ల ఈ తేదీల్లో పుట్టిన మహిళలు పదేపదే మారే పరిస్థితుల్లో బాగా సరిపోయే స్వభావం కలిగి ఉంటారు.
వారు తక్షణ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలవారు. పనిని ఎలా చేయించుకోవాలో తమకు అవసరం ఏది అన్నది చక్కగా అర్థం చేసుకొని చాకచక్యంగా వ్యవహరిస్తారు. వ్యక్తిగత జీవితంలోనూ ఈ అమ్మాయిలు తమ భాగస్వామిపై బాగా దృష్టి పెడతారు. వారు ఏ విషయానికైనా అప్రమత్తంగా ఉంటారు. తమ జీవిత భాగస్వామిని మాటలతో, బుద్ధితో ఆకర్షించడం వీరి ప్రత్యేకత.
మూలసంఖ్య 7
7, 16 లేదా 25 తేదీల్లో జన్మించిన వారికి మూలసంఖ్య 7గా భావిస్తారు. ఈ సంఖ్యకు కేతు గ్రహం అధిపతి. కేతు ప్రభావం వల్ల ఈ సంఖ్యకు చెందిన అమ్మాయిలు స్వేచ్ఛాభిలాషులు, బలమైన అభిప్రాయాలవారు. వారు ఎప్పుడూ తమ వ్యక్తిగత స్పేస్‌ను కాపాడుకునేలా చూసుకుంటారు.
వీరికి తమ జీవితాన్ని తామే ముందుకు నడిపించాలనే ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. ప్రేమ, సంబంధాలు అన్నా వారు తమ నియంత్రణలో ఉండాలనుకుంటారు. ఏ విషయాన్ని వదిలేయరు.. తెలివిగా, ఆకర్షణతో, మాటల మాయతో వారి భాగస్వామిని ఆకట్టుకుంటారు. ఈ నైపుణ్యం వల్ల వాళ్లు రిలేషన్‌షిప్‌ను తమకు అనుకూలంగా మలచుకోవడం తేలికగా చేయగలరు.
ఈ రెండు మూలసంఖ్యలకి చెందిన అమ్మాయిలు సాధారణంగా మనసును గెలుచుకునే శక్తి కలవారు. వారు ఎంత చురుకుగా, తెలివిగా ఉంటారో.. అదే విధంగా తమ భాగస్వామితో ఉన్న సంబంధాన్ని విజయవంతంగా కొనసాగిస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం వీరిలో ఉన్న ఈ ప్రత్యేకతలు ఇతరుల కంటే వీరిని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేలా చేస్తాయి.