

ప్రతి వారం థియేటర్స్ లో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలై మంచి విజయాలు అందుకున్నాయి. ఇక ఈ వారం కూడా కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఈవారం క్రేజీ సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఓటీటీల్లోనూ పదుల సంఖ్యలో సినిమాలు విడుదల అవుతున్నా ప్రేక్షకులు థియేటర్స్ లో సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ వారం థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమాలు ఇవే.. ఈవారం పెద్ద సినిమాలు విడుదల కానప్పటికి.. క్రేజీ సినిమాలను పేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నితిన్ రాబిన్ హుడ్ సినిమా గురించే .. నితిన్ హలా కాలంగా సాలిడ్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. వెంకీ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమా పేక్షకుల ముందుకు రానుంది. గతంలో నితిన్ వెంకీ కాంబినేషన్ లో భీష్మ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా మార్చ్ 28 పేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు మోహన్ లాల్ నటిస్తున్న లూసిఫర్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్ లాల్ ఎంపురాన్ చిత్రం మార్చి 27న రాబోతోంది. చియాన్ విక్రమ్ నుంచి వీర ధీర శూర అనే చిత్రం డబ్బింగ్ రూపంలో రాబోతోంది. చిన్నా మూవీ డైరెక్టర్ అరుణ్ కుమార్ తెరకెక్కించిన వీర ధీరన్ శూరన్ మూవీని తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు. వీటితోపాటు మ్యాడ్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యాడ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఫ్రాంచైజీని కంటిన్యూ చేస్తున్నారు మేకర్స్. వీటితో పాటు సల్మాన్ ఖాన్, రష్మిక కాంబోలో ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న సికందర్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఈవారం థియేటర్స్ లో క్రేజీ సినిమాలు సందడి చేయనున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..