
టాలీవుడ్ లో చాలా మంది యంగ్ డైరెక్టర్స్, హీరోలు మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. కొత్త కొత్త కథలు చేస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు నటులుగాను తమ సత్తా చాటుకున్నారు. అలాగా తమ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోనూ చిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు, కాగా పై ఫొటోలో కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా.? టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడు ఆయన. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంతకూ ఆ నటుడు ఎవరో గుర్తుపట్టారా.? గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు.. ఇంతకూ ఆయన ఎవరో కనిపెట్టారా.?
పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ దర్శకుడు ఎవరో కాదు వరుస విజయాలతో దూసుకుపోతున్న వెంకీ కుడుముల. దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టక ముందు వెంకీ డైరెక్టర్ తేజ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశారు. ఆ సమయంలోనే తనలో ఉన్న స్పార్క్ గమనించి తేజ నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారట. ఈ విషయాన్నీ వెంకీనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పైన కనిపిస్తున్న ఫోటో నీకు నాకు డాష్ డాష్ సినిమాలోనిదే.. దర్శకత్వంతో పాటు నటనలోనూ తనకు ఆసక్తి ఉందని తెలిపారు వెంకీ కుడుముల.
ఇక నాగ శౌర్య హీరోగా నటించిన ఛలో సినిమాతో దర్శకుడిగా మారారు వెంకీ. ఈ సినిమాతోనే రష్మిక మందన్న టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఛలో సినిమా తర్వాత నితిన్ హీరోగా భీష్మ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలోనూ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. భీష్మ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరోసారి నితిన్ తో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మార్చ్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే డేవిడ్ వార్నర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.