
అమెరికా కీలక స్థావరమైన డయోగో గార్సియాలో అమెరికా బి 2 స్టెల్త్ బాంబర్లను మోహరించింది. ప్రపంచంలోనే వీటిని తలదన్నే బాంబర్లు లేవని చెప్పాలి. ఇది ఇరాన్ లో అండర్ గ్రౌండ్ స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకోగలదు. అమెరికా వద్ద ఇలాంటివి మొత్తం 20 ఉంటే వీటిలో ఆరును ఇరాన్ సమీపంలోకి తరలించాయి అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అణు చర్చలు విఫలమైతే ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై ఖచ్చితత్వంతో దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా హెచ్చరిస్తున్నారు. దీనికి ఇరాన్ కూడా దీటుగా స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న యురేనియం నిల్వలతో తాము తేలికగా అణుబాంబును తయారు చేసుకోగలమని చెబుతుంది. ఇరాన్, అమెరికా ల మధ్య తొలి విడత చర్చలు ఓమాన్ లో జరిగాయి. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్టకాఫ్ పాల్గొన్నారు. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగి ఫలవంతం అయ్యాయని అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా చర్చలు సాఫీగా జరుగుతున్నట్లు ధ్రువీకరించారు.
మరిన్ని వీడియోల కోసం :