
సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. అమెరికా వెళ్లాలనుకున్న ఓ బారతీయుడి కల కేవలం 40సెకన్లలోనే ఆవిరైపోయింది. వీసా ఇంటర్య్యూలో నిజాయితీగా జవాబులిచ్చినా అమెరికా చెవికెక్కలేదు. డిస్మిస్ అంటూ వీసా అప్లికేషన్‌ను రపా రపా చించేసింది. ఇది ఒక్కడి వేదన కాదు.. అమెరికా వెళ్లాలనుకుంటున్న లక్షలమంది భారతీయుల ఆవేదన. ఆక్రందన. అలాగని అమెరికాలో ఉన్న మన భారతీయుల పరిస్థితి బాగుందా..అంటే అదీ లేదు. అక్కడ దిన దినగండంగా బతుకుతున్నారు భారతీయులు. చిన్న తప్పులకే గెటవుట్ అంటోంది ట్రంప్ సర్కార్. ఎందుకిలా జరుగుతోంది. పోనీ న్యాయం కోసం కోర్టులకు వెళ్లాలంటే…లాయర్ల ఫీజు తాటతీస్తోంది. ఈ సంక్షోభం నుంచి భారతీయులు బయటపడే దారేలేదా..?
అమెరికా వీసా ప్రక్రియ ఎప్పుడూ సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా భారతీయ దరఖాస్తుదారులకు. 2024లో, అమెరికా ఎంబసీ భారతదేశంలో 14 లక్షలకు పైగా వీసా దరఖాస్తులను పరిశీలించింది. వీటిలో గణనీయమైన సంఖ్యలో స్టూడెంట్ వీసాలు ఉన్నాయి. అయినప్పటికీ, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలైన B1/B2 . F-1 వీసాలను అమెరికా పెద్ద ఎత్తున తిరస్కరించింది. చాలా మంది దరఖాస్తుదారులు తమ ఇంటర్వ్యూలు కేవలం ఒకటి లేదా రెండు ప్రశ్నలతో ముగిసిపోయాయి..ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన కారణాలు అమెరికా చెప్పలేదు. ఈ ప్రక్రియలో అధికారుల విచక్షణాధికారం పెద్ద పాత్ర పోషిస్తోంది. ఉదాహరణకు, ఒక దరఖాస్తుదారుడు తన స్వదేశంతో బలమైన సంబంధాలను నిరూపించలేకపోతే..అంటే, వాళ్లు అమెరికాలో శాశ్వతంగా ఉండకుండా తిరిగి స్వదేశానికి వస్తామని బలంగా అమెరికాకు చెప్పాలి. అది నిరూపించలేకపోతే…వీసా రాదు.
చదువుకునే విద్యార్ధులకే కాదు…రెండువారాలు అమెరికాలో ఉండేందుకు వెళ్లే పర్యాటకులకూ వీసా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈమధ్య ఓ భారతీయుడు అమెరికా పర్యటనకు వీసాకు అప్లై చేస్తే…ఇంటర్వ్యూలో అతడు చెప్పిన సమాధానం కారణంగా కేవలం 40 సెకన్లలోనే వీసాను తిరస్కరించారట. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఆ వ్యక్తి ఆవేదన వెళ్లగక్కాడు. ఈ సమస్యలు మరింత లోతుగా పరిశీలిస్తే, అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థమవుతోంది. ఇమ్మిగ్రేషన్ కోర్టులు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ .USCIS ప్రక్రియలు అత్యంత సంక్లిష్టంగా, ఆలస్యంగా ఉంటాయి. కొన్ని కేసులు సంవత్సరాలపాటు కొనసాగుతుంటాయి. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడి ఆర్థిక భారంతో సతమతమవుతారు. ఒక్కసారి యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వెసెస్ వెబ్సైట్లోఉన్నఈ అలర్ట్ మెస్సేజ్ చదవండి. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డస్ను నిశితంగా గమనించండి.
Rejected for B1/B2 Visa in 40 Seconds at New Delhi — What Went Wrong and What Could I Have Done Differently?
byu/nobody01810 inusvisascheduling
USCISలో అప్లోడ్ చేసిన ఫోటోలు….అన్రిటచ్డ్గా ఉండాలి..అంటే ఫోటోలు ఎడిట్ కాకూడదు..ఎలాంటి స్క్రాచ్ ఉండకూడదు..పొరపాటున ఫోటోకు చిన్న గీతలాంటిది పడ్డా టోటల్ వీసానే రద్దు చేస్తారట. లేకుంటే ప్రక్రియ మొత్తం మరింత ఆలస్యం అవుతుందట. ఇది జస్ట్ శాంపిల్ వార్నింగే…ఇంతకుమించిన అరాచకపర్వం యూఎస్ ఇమిగ్రేషన్‌లో నడుస్తోంది. ఇలాంటి చిన్న తప్పుల వల్ల ఎందరో భారతీయ విద్యార్థులు F-1 వీసా స్టేటస్‌ను కోల్పోయారు. ఓ విద్యార్ధి యూనివర్సిటీ అకడమిక్ ప్రోబేషన్ విధానాన్ని అనుసరించలేదన్న కారణంతో వీసా స్టేటస్‌నే రద్దు చేశారు. తన స్టేటస్‌ను పునరుద్ధరించుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే…ఫీజుల పేరుతో న్యాయవాదులు విద్యార్ధులను వేపుకు తింటున్నారు. మామూలుగా ఇలాంటి ఇమిగ్రేషన్ కేసుల్లో న్యాయవాదులు 300 నుంచి మాగ్జిమమ్ వెయ్యి డాలర్లు చార్జ్ చేస్తారు. కానీ ఇప్పుడు ట్రంప్ పుణ్యమాని బాధితులు వందల్లో ఉండడంతో..ఇదే అవకాశంగా న్యాయవాదులు తమ ఫీజును డబుల్ కాదు…ట్వంటీ టైమ్స్ రెట్టింపు చేశారు. ఇమిగ్రేషన్ సంబంధించిన కేసులో ఇటీవల ఓ విద్యార్ధి 10,000 డాలర్లకు పైగా ఖర్చు చేశాడు, కానీ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది.
ఈ సవాళ్ల వెనుక ఉన్న మూల కారణాలను పరిశీలిస్తే, అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలు కఠినంగా ఉండడమే. ట్రంప్ వచ్చాక నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై నియంత్రణలు మరింత కఠినతరం అయ్యాయి. ఇది చాలనద్నట్టు వీసా ప్రక్రియలు, చట్టపరమైన సమస్యల గురించి సరైన సమాచారం లేకపోవడం అతిపెద్ద సమస్యమారింది. వీసా కన్సల్టెంట్లు, కొందరు న్యాయవాదులు డబ్బు కోసం విద్యార్ధులను తప్పుదోవ పట్టించి…నిలువునా దోచేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వెల్లాలనుకున్నవారికి..అమెరికాలో ఆల్రెడీ ఉన్నవారికీ ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం పెద్ద గుదిబండగా మారింది. వీసా రావడం దేవుడెరుగు…ఆల్రెడీ వీసా ఉన్నవాళ్లకూ వీసా భయం పట్టుకుంది. ఎప్పుడు వీసా రద్దు నోటీసు వస్తుందోనన్న ఆందోళనలతో మన విద్యార్ధులు రోజులు లెక్కపెడుతున్నారు.