
సన్‌రైజర్స్ హైదరాబాద్ పాకెట్ డైనమెట్ ఇషాన్ కిషన్ ఆరెంజ్ జెర్సీలో తొలి మ్యాచ్ ఆడాడు. ఇది ఇంట్రా-స్క్వాడ్‌లో ప్రాక్టీస్ మ్యాచ్. SRH జట్టు ఈ మ్యాచ్‌ను రెండు భాగాలుగా విభజించి ఆడింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 58 బంతుల్లో మొత్తం 137 పరుగులు చేశాడు. తన పేలుడు బ్యాటింగ్‌తో SRH మేనేజ్మెంట్, కావ్య మారన్‌కు పెద్ద రిలీఫ్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇదే పెర్ఫార్మన్స్ ఐపీఎల్లో కంటిన్యూ చేస్తే ఇషాన్ కిషన్ మళ్లీ తిరిగి టీమిండియాలోకి వచ్చే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో.. ఇషాన్ కిషన్‌కు టీమ్ A, టీమ్ B రెండింటికీ బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. దీన్ని ఇషాన్ కిషన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 137 పరుగులు చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ‘ఎ’ 260 పరుగుల భారీ స్కోరు చేసింది. 261 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీం-బీ 200 కంటే ఎక్కువ పరుగులు సాధించింది. కానీ మొత్తంగా టార్గెట్ చేధించలేకపోయింది. రెండు జట్ల పేలుడు బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. అతడు మొదట టీం A తరపున బ్యాటింగ్ చేసి 28 బంతుల్లో 64 పరుగులు చేసి అవుట్ కాగా.. ఆ తర్వాత, టీం B తరపున 30 బంతుల్లో 73 పరుగులు చేసిన రిటైర్ అయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తంగా 58 బంతుల్లో 137 పరుగులు చేశాడు.
SRH మొదటి ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సాటిలేని బ్యాటింగ్ ప్రదర్శనతో ఇషాన్ కిషన్ జట్టు యాజమాన్యం, ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. సన్‌రైజర్స్ మిడిలార్డర్ సేఫ్ అని చెప్పడమే కాదు.. ప్లేయింగ్ XIలో తన చోటును ఖరారు చేసుకున్నాడు. తాను బరిలోకి దిగితే బాక్సాఫీసు బద్దలైపోతుందని క్లారిటీ ఇచ్చాడు. కాగా, ఇషాన్ కిషన్ ఫామ్‌లోకి వచ్చాడనడంలో సందేహం లేదు. అతడు బ్యాటింగ్ చేసిన విధానం, ఫోర్లు, సిక్సర్లు బాదడం చూస్తే, ఆరెంజ్ ఆర్మీ ప్లేయింగ్ ఎలెవన్‌లో అతని స్థానం ఖచ్చితంగా ఉంది. అదే జరిగితే, IPL 2025లో తన బ్యాటింగ్ ప్రదర్శనతో ఇషాన్ కిషన్ మళ్లీ టీమ్ ఇండియాలోకి తిరిగి రావడం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు.
Ishan smashing it! 🔥🔥🔥
Watch live here – https://t.co/wHZFeh2wLU
Ishan Kishan | #PlayWithFire pic.twitter.com/3Psy4Nunkk
— SunRisers Hyderabad (@SunRisers) March 15, 2025