
రానున్న రోజుల్లో పెద్ద వ్యాపారులు యూపీఐ ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని జాతీయ మీడియా తెలిపింది. వార్షిక ఆదాయం 40 లక్షల రూపాయలకు పైన ఉండే వ్యాపారులకు యూపీఐ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ MDRను తిరిగి తీసుకురావాలని ప్రతిపాదిస్తూ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులు ఇటీవల కేంద్రానికి అధికారిక ప్రతిపాదన పంపారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఓ బ్యాంకర్ చెప్పినట్లు మీడియా కథనాలు తెలిపాయి. రూ.40లక్షల్లోపు వార్షికాదాయం ఉండే వ్యాపారులు యూపీఐ చెల్లింపులను ఉచితంగానే స్వీకరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఛార్జీలను తిరిగి తీసుకురావడం వల్ల యూజర్లపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ లావేదేవీల కోసం యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. కాకపోతే దీనివల్ల వ్యాపారులు మళ్లీ క్యాష్ చలామణికి మొగ్గు చూపే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ వయసులో.. చిన్న అమ్మాయితో ముచ్చటగా రొమాన్స్
ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త