
బాగ్ అంబర్‌పేట్‌లోని స్థానికుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను ప్రారంభించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. బతుకమ్మ కుంటకు సంబంధించిన వివాదం కోర్టులో పరిష్కారమయ్యిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ చెరువును పునరుద్ధరిస్తే పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారుతాయని ఆయన అన్నారు. పనులకు సహకరించాలని స్థానికులను కోరారు. అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని స్థానికులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హామీ ఇచ్చారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..