
హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రం ప్రాచీనంగా ఉంది. మన ఇంట్లో ఉన్న ప్రతీ వస్తువు స్థానం సరైందా లేదా అనేది శక్తులపై ప్రభావం చూపుతుంది. వాస్తు నియమాలు పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇది కుటుంబ సభ్యుల మీద కూడా మంచి ప్రభావం చూపుతుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శుభ వాతావరణం అవసరం. వాస్తు నియమాలు పాటించడం ద్వారా మన ఇంటిలో శాంతి, డబ్బు, అభివృద్ధి ఉంటాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించాలి. ఇది ఒక శుభ సంకేతం. దీపం వెలిగించడం వల్ల దైవానుగ్రహం వస్తుంది. దీపానికి అర్ధం శాంతి, ఆత్మశుద్ధి. దీపం వెలిగించినప్పుడు దుష్ట శక్తులు నశిస్తాయని నమ్మకం ఉంది. దీని ద్వారా లక్ష్మీదేవి ఆనందంగా ఉంటుందని చెబుతారు.
ఇంట్లోకి మంచి శక్తులు రావాలంటే ముందు ద్వారం శుభ్రంగా ఉండాలి. బూట్లు, చెప్పులు ద్వారం వద్ద ఉంచరాదు. వాస్తు ప్రకారం ద్వారం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అందుకే బయట మురికి ఉండకుండా చూసుకోవాలి. అలా చేస్తే ఇంట్లోకి అనుకూల శక్తి, శాంతి వస్తుంది.
చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఎప్పుడూ కొంతమేర నీరు నింపి ఉంచడం మంచిదిగా భావిస్తారు. నీరు అనేది శుభ్రతకు, శుద్ధికి, శక్తి ప్రవాహానికి సంకేతం. బాత్రూంలో నీరు ఉండటం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని.. ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుందని నమ్మకం. ఇది ఇంటి సంపద నిలవడానికి, శుభ ఫలితాలు చేకూరేందుకు సహాయపడుతుంది.
ఇంట్లో ప్రతి రాత్రి కర్పూరం కాల్చి దాని పొగ ఇంటి నలుమూలలా వెళ్ళేలా చూడాలి. ఇది వాస్తు ప్రకారం ప్రతికూల శక్తులను బయటకు తరిమేయడంలో సహాయపడుతుంది. కర్పూరం శుద్ధికి ప్రతీక. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి నిలుస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది.
ప్రతి రాత్రి దక్షిణ దిశలో ఆవ నూనెతో దీపం వెలిగించాలి. వాస్తు ప్రకారం పూర్వీకుల స్థానం ఈ దిశ అని చెబుతారు. దీపం వెలిగించినప్పుడు వారు సంతోషంగా ఉంటారు. దీని వల్ల మన ఇంట్లో శుభ ఫలితాలు కనిపిస్తాయి. మన జీవితంలో ఆనందం నిలుస్తుంది. మనం ఈ నియమాలను పాటిస్తే ఇంట్లో శుభం, శాంతి, సంపద స్థిరంగా ఉంటాయి.