
ఇక బురద మేట.. నీటి ఊటతో బురద అంతకంతకూ పెరుగుతోంది. దాన్నంతా బయటకు తీయడం కూడా ఇబ్బందికరంగానే మారుతోంది. ఇక మూడోది కన్వేయర్ బెల్డ్.. 12 కిలోమీటర్ల తర్వాత సిబ్బంది కాలినడకన స్పాట్‌కి వెళ్లేది కన్వేయర్ బెల్ట్‌పైనే.. ఇది ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. దానిపై నడవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. దాన్ని రిపేర్ చేసేందుకు ఇంజనీర్ల బృందం లోపలికి వెళ్లింది. సొరంగంలో కార్మికుల్ని గుర్తించేందుకు స్నిపర్ డాగ్, ర్యాట్ హోల్ టీమ్ సేవల్ని ఉపయోగిస్తున్నారు. ఇక రోజులు గడుస్తున్నా కొద్దీ బాధిత కుటుంబాల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఒక్కొక్కరుగా ఎల్ఎల్బీసీ ప్రాంతానికి చేరుకుని.. తమ వాళ్ల ఆచూకీపై ఆరా తీస్తున్నారు. 40 మీటర్ల పాటు పేరుకుపోయిన బురద మేట.. టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాలను ఎంత త్వరగా వేగంగా తీస్తే అంత త్వరగా కార్మికుల్ని గుర్తించే వీలుంటుంది. ఈ ప్రక్రియను చాలా త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో రెస్క్యూ టీమ్ ముందుకెళ్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
ప్రధాని మోదీ తీసుకునే సూపర్ ఫుడ్ ఇదే.. లాభాలు తెలిస్తే షాకవుతారు!
చివరి అమృత్‌స్నాన్.. ప్రయాగ్‌రాజ్‌కు కోటి మందికి పైగా.. వీడియో!
ఫంక్షన్ హాల్లో కాదు పంట పొలంలో పెళ్లి.. కారణమేంటంటే.. వీడియో
ఆ గ్రహశకలంతో భూమికి తప్పిన ముప్పు.. ఏం జరిగిందంటే..!వీడియో