ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు నటి షకీలా.. ఒకప్పుడు ఆమె కోసం కుర్రాళ్లు పడి చచ్చిపోయేవారు. బీ గ్రేడ్ సినిమాలో నటించి పాపులారిటీ సొంతం చేసుకున్నారు షకీలా.. శృంగార తారగా దేశవ్యాప్తంగా షకీలాకు క్రేజ్ ఏర్పడింది. అలాగే చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు షకీలా. తెలుగుతో పాటు తమిళ్ బాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు షకీలా.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న షకీలా.. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించారు షకీలా.. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు షకీలా. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో.. తన వ్యక్తిగత జీవితం, కెరీర్, గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను తప్పులు తక్కువగా చేస్తానని, ఒకవేళ ఎవరినైనా బాధపెడితే వెంటనే క్షమాపణ చెబుతానని షకీలా అన్నారు. మనసుపూర్వకంగా చేసే క్షమాపణకు ఎప్పుడూ సిగ్గుపడనని ఆమె అన్నారు. మంచి పనులను లెక్కించుకోకూడదని, తప్పులు చేస్తే మాత్రం సారీ అడగడంలో తప్పులేదని ఆమె అన్నారు. అలాగే సమాజం తనపై జాలిపడడం కాకుండా, గర్వంగా చెప్పుకునే విధంగా తాను ఏదైనా చేయాలనుకుంటున్నానని షకీలా తెలిపారు. దీని కోసం ఇంకా ఎంతో సాధించాల్సి ఉందని, భవిష్యత్తులో తన ప్రయాణంపై మరింత గర్వపడేలా చేస్తుందని అన్నారు. అదేవిధంగా తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని, ప్రజలకు మంచి చేయాలనే బలమైన కోరిక ఉందని ఆమె అన్నారు. కుటుంబ నేపథ్యం లేకపోవడం వల్ల ఎటువంటి భయాలు ఉండవని, ఒకవేళ ఏదైనా జరిగినా తనకెలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో వేణు మాధవ్, ఆలీ తన స్నేహితులని షకీలా తెలిపారు. వేణు మాధవ్‌తో తనకున్న స్నేహం, వారి మధ్య చోటు చేసుకున్న ఒక మర్చిపోలేని సంఘటన గురించి షకీలా పంచుకున్నారు. ఒక షూటింగ్ సందర్భంగా వేణు మాధవ్, బ్రహ్మానందం, రఘు బాబుతో పాటు పలువురు ఉన్నప్పుడు, వేణు తన గదికి వచ్చేవారని ఆమె తెలిపారు. ఒక రాత్రి, వేణు ఆమె ఒకే గదిలో పడుకున్నప్పుడు, అసిస్టెంట్ పక్కన ఉండగా, వేణు తనతో హస్కీ వాయిస్‌లో మాట్లాడారని షకీలా గుర్తు చేసుకున్నారు. తాను ఏదైనా తప్పుగా అడగబోతున్నాడేమోనని మొదట భయపడ్డానని, అయితే వేణు తనపై కాళ్లు వేయవద్దని, తన భార్య, ఇద్దరు పిల్లల కోసం తాను బతికి ఉండాలని అన్నారని. ఈ సంఘటన తనను రాత్రంతా నవ్వించిందని, మరుసటి రోజు ఉదయం బ్రహ్మానందం, రఘు బాబుతో పాటు అందరికీ ఈ విషయం చెప్పి నవ్వుకున్నానని షకీలా అన్నారు. వేణు మాధవ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని షకీలా అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
