
ఫరియా అబ్దుల్లా.. ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడిని ఓవర్ నైట్ స్టార్ ను చేసింది. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ హైదరాబాదీ అందం. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.
ఈ పొడుగు కాళ్ల సుందరి జాతిరత్నాలు సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. అమాయకపు యువతిగా కనిపించి మెప్పించింది. ఆతర్వాత ఈ భామ వరుసగా సినిమాలు చేసింది. కానీ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.
కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అలాగే బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. అయినా అంతగా గుర్తింపు రాలేదు. దాంతో ఈ బ్యూటీ గేరు మార్చి గ్లామర్ గేట్లు ఎత్తేసింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఓ రేంజ్ లో ఫోటోలు షేర్ చేస్తుంది.
తన డాన్స్ తో నెటిజన్స్ ను ఆకట్టుకుంటూనే.. తన గ్లామరస్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటుంది ఫరియా అబ్దుల్లా. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది.
మత్తువదలరా 2 సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ.. అంతగా ఈ చిన్నదానికి ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం ఓ డాన్స్ షోకు జడ్జ్ గా వ్యహరిస్తుంది. ఇక ఫరియా అబ్దుల్లా తాజాగా బస్సులో అందాలు ఆరబోస్తూ ఫొటోలకుఫోజులిచ్చింది. ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.