
హీరోయిన్స్ గా రాణించడం అంత ఈజీ కాదు. చాలా మంది హీరోయిన్స్ స్టార్ డమ్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. యంగ్ హీరోయిన్స్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు కొంతమంది భామలు. ఇదిలా ఉంటే కొంతమంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా.? ఆమె తెలుగులో వరుసగా సినిమాలు చేసింది కానీ సక్సెస్ అవ్వలేక పోయింది. ఆరు సినిమాలు చేసింది కానీ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. దాంతో సినిమాలకు దూరం అయ్యి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. అది కూడా ఓ హీరోను పెళ్లి చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఆ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఆ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? వితిక శేరు. ఈ చిన్నది తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. అంతు ఇంతు ప్రీతి బంతు అనే కన్నడ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత మరో కన్నడ సినిమా చేసింది. ఉల్లాస ఉత్సాహ అనే సినిమాలోనూ నటించింది.
ఇవి కూడా చదవండి
ఇక తెలుగులో ప్రేమించు రోజుల్లో అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసింది. సందడి, మంచు మనోజ్ నటించిన ఝుమ్మందినాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో మరి సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లోనూ ఒకటి రెండు సినిమాలు చేసింది. ఆతర్వాత ఈ చిన్నది హీరో వరుణ్ సందేశ్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యి ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతుంది. కాగా సోషల్ మీడియాతో పాటు పలు టీవీ షోల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సొంతం ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
వితిక శేరు ఇన్ స్టా ఫొటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.