
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు, పేమ , బ్రేకప్ ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో.. ఎందుకు విడిపోతున్నారో కూడా అర్ధం కావడం లేదు. స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా ఈ మధ్య సడన్ గా విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు.18, 20ఏళ్లు కలిసున్నా వారు కూడా సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నాం అని అనౌన్స్ చేసి అభిమానులకు కోలుకోలేని షాక్ ఇస్తున్నారు. అంతే కాదు ఇండస్ట్రీలో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నవారు కూడా ఉన్నారు. కొంతమంది లేటు వయసులోనూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వారిలో ఈ టాలీవుడ్ నటుడు ఒకరు. 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకొని అందరికి ఊహించని షాక్ ఇచ్చాడు. తనకన్నా పదేళ్లు తక్కువ వయసున్న అమ్మాయిని పెళ్లాడాడు ఈ సీనియర్ నటుడు. ఇంతకూ అతను ఎవరో..? ఆ వధువు ఎవరో ఇప్పుడు చూద్దాం.!
సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థిని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన ఎన్నో సినిమాలతో ద్వారా మనకు సుపరిచితుడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో వివిధ పాత్రలు పోషించారు.. ముఖ్యంగా పోకిరి సినిమాలో విలన్గా అతడి నటన నెక్ట్స్ లెవల్లో క్లిక్ అయ్యింది.
గతంలో ఎక్కువ విలర్ రోల్స్ చేసిన ఈ యాక్టర్.. ఇప్పుడు ఫాదర్ తరహా రోల్స్ చేస్తున్నారు. కాగా 60 ఏళ్ల వయస్సులో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం.. అటు నార్త్ ఇండస్ట్రీ, ఇటు సౌత్ ఇండస్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాను కోల్కతా క్లబ్లో ఆశిష్ విద్యార్థి పెళ్లాడారు. వీరి వివాహం 2023లో జరిగింది. అప్పటికి ఆయన వయసు 60ఏళ్లు, ఆమె వయసు 50ఏళ్లు. ప్రేమకు, పెళ్ళికి వయసుతో సంబంధం లేదు అని చెప్పకనే చెప్పారు ఈ జంట. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆశిష్ విద్యార్థి రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. వివిధ ప్రదేశాల్లో దొరికే ఫుడ్ ను టేస్ట్ చేస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఆశిష్ విద్యార్థి తన భార్యతో దిగిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.