కోనసీమ జిల్లా ఎస్. యానాం ఆంధ్ర గోవా బీచ్‌లో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి. సముద్ర తీరానా జరిగిన ఈ వేడుకలకు లక్షలాది మంది పర్యాటకులు తరలి రావడంతో బీచ్ సందడిగా మారింది. పర్యాటకుల కోసం రూ.5 కోట్లతో భారీ ఆడిటోరియం, రెస్టారెంట్‌ను నిర్మించారు. రాత్రి పూట ప్రత్యేక లైనింగ్‌ను ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగలో భాగంగా మూడు రోజుల పాటు ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించారు. ఉదయం సూర్యోదయాన్ని వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, కల్పించిన సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబాలతో సహా వచ్చి ఆనందించేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయని పర్యాటకులు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?
