
గుడిలో శివలింగంను చుట్టుకున్న నాగుపాముని చూసి అందరూ ఆశ్చర్యాన్ని గురయ్యారు..సాక్షాత్తు దేవుడే ఉన్నాడు ఇక్కడ అని పూజలు చేశారు..ఈ ప్రకృతిలో నిత్యం అనేక అరుదైన ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రతి ఘటనకూ ఓ కారణం ఉంటుంది… ఆస్తికులేమో అది దేవుడి మహత్యం అంటుంటారు. నాస్తికులైతే.. దానికి ప్రకృతి ధర్మం అని పేరు పెడుతారు. ఎవరు ఎలా అనుకున్నా , ఏమనుకున్నా..ప్రతి ఘటన వెనుక ఖచ్చితంగా ఓ అదృశ్య శక్తి పనిచేస్తూ ఉంటుందని మరికొందరు అంటున్నారు. అయితే, ఒక హనుమన్ ఆలయంలో ఉన్నశివలింగం వద్ద నాగుచుట్టుకుని ఉండటం భక్తులకు దర్శనం ఇచ్చింది. అది చూసిన గ్రామస్తులు, శివభక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆ ప్రాంతమంతా శివనామస్మరణతో మార్మోగిపోయింది. వివరాల్లోకి వెళ్తే
మెదక్ జిల్లా శివంపేట మండలం బిజీలిపూర్ గ్రామం లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న హనుమాన్ దేవాలయంలో అర్ధరాత్రి ప్రవేశించిన ఒక నాగుపాము గర్భగుడిలోని శివలింగం వద్దకు చేరుకుంది. శివ లింగం వద్ద సుమారు గంటపాటు ఆ పాము పడగ విప్పి అలాగే ఉండిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్లిన గ్రామ యువకులు నవీన్, నర్సింలు గమనించి ఫోటోలు తీయడంతో విషయం బయటకు పొక్కింది. విషయం తెలిసిన స్థానికులు, గుడికి వచ్చిన భక్తులు తొలుత షాక్ అయ్యారు. కానీ, ఇదంతా ఆ దేవుడి మహిమగా భావిస్తున్నారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు మరుసటి రోజు ఉదయం హనుమాన్ దేవాలయానికి చేరుకొని పెద్ద ఎత్తున పూజలు అభిషేకాలు చేపట్టారు. సాక్షాత్తు ఆ శివయ్య ఆలయంలోకి వచ్చి దర్శనమిచ్చాడు అంటూ సంబరపడ్డారు గ్రామానికి చెందిన యువకులు నవీన్ నర్సింలు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..