
హైదరాబాద్ కు చెందిన అమీన్ అహ్మద్ అన్సారీ చాంద్రాయణగుట్టలోని షాహీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతను ఏడు అడుగుల హైట్ ఉంటాడు. అన్సారీ తండ్రి కాచిగూడ డిపోలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. అనారోగ్య సమస్యలతో 2021లో ఆయన మృతి చెందాడు. దీంతో ఇంటర్ పూర్తి చేసిన అన్సారీకి కారుణ్య నియామకం కింద ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. మెహిదీపట్నం డిపోలో అన్సారీకి కండక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడే అతనికి అసలు సమస్య వచ్చింది. బస్సు ఎత్తు చూస్తే 6.4 అడుగులు. అన్సారీ హైట్ చూస్తూ 7 అడుగులు. దీంతో బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వర్తించడం అన్సారీకి చాలా ఇబ్బందిగా మారింది. హైదరాబాద్ బస్సులో ప్రయాణికుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కండక్టర్లకు కనీసం కూర్చోవడానికి కూడా వీలుండదు. దీంతో అన్సారీ రోజుకు సుమారు 8 నుంచి 10 గంటలు బస్సులో తల వంచి ప్రయాణిస్తుండటంతో మెడ, వెన్నునొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ సమస్యలతో తరచూ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్సారీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తనకు ఆర్టీసీలోనే ఇంకేదైనా ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నాడు.
మరిన్ని వీడియోల కోసం
ఊబకాయులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
తోపులే జడుసుకున్నారు.. ఈ క్రూజ్ టూర్‌కి గుండె ధైర్యం ఉందా?వీడియో
పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా.. మృత్యుఒడికి.. వీడియో
బెడ్రూమ్లో ఉండాల్సిన మంచం రోడ్డుపైకి వస్తే.. వీడియో