
హీరోలు, హీరోయిన్స్ అభిమానులు చేసే పనికి కొన్నిసార్లు సహనం కోల్పోతూ ఉంటారు. ఇప్పటికే అభిమానులు చూపించే అత్యుత్సహం కారణంగా ఆగ్రహానికి గురైన హీరోలను చాలా మందిని చూశాం. బాలకృష్ణ ఎంతో మందిని చెంపదెబ్బ కూడా కొట్టారు. అభిమానులు చేసే పనులు కొన్ని సార్లు సెలబ్రెటీలను అంతలా విసిగిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ సహనాన్ని కోల్పోయి ఏకంగా అభిమాని చెంప చెళ్లుమనిపించింది. ఇంతకూ ఆమె ఎవరు.? ఎందుకు సహనాన్ని కోల్పోయింది.? అసలు ఆ అభిమాని ఏం చేశాడు. ? అనేది ఓసారి చూద్దాం.!
ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..
కన్నడ బ్యూటీ నటి రాగిణి ద్వివేది తన సహనాన్ని కోల్పోయింది . దానికి బలమైన కారణం కూడా ఉంది. రాగిణి ద్వివేది సాధారణంగా చాలా కూల్ గా ఉంటుంది. ఆమె తన అభిమానులతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడతారు. కానీ కొన్నిసార్లు, అభిమానులు చాలా దూకుడుగా ప్రవర్తిస్తుంటారు. రాగిణి ద్వివేది విషయంలో కూడా ఇదే జరిగింది. తనను బలవంతంగా తాకడానికి ప్రయత్నించిన వ్యక్తిని రాగిణి ద్వివేది చెంపదెబ్బ కొట్టింది. ఆ నటి చేసింది సరైనదేనని నెటిజన్లు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: ఈమెను మించిన హాట్ బ్యూటీ ఉంటుందా..! చేసింది రెండు సినిమాలు.. ఒకొక్క మూవీకి అందుకుంటుంది రూ.3 కోట్లు
ఇటీవల, రాగిణి ద్వివేది ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెని చూడటానికి ఆ కార్యక్రమానికి జనం భారీగా వచ్చారు. రాగిణితో ఫోటో దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. ఆ సమయంలో, ఆ గుంపులోని ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. అతను రాగిణి చేయి పట్టుకుని లాగాడు. అది రాగిణికి చాలా కోపం తెప్పించింది. రాగిణి వెంటనే ఆ వ్యక్తిని లాగి పెట్టి కొట్టింది. రాగిణి చాలా సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో బిజీగా ఉంది. స్టార్ హీరోలతో కలిసి నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలోనే కాకుండా ఇతర భాషల చిత్రాలలో కూడా నటించి అభిమానులను సొంతం చేసుకుంది. రాగిణి ద్వివేది మాలీవుడ్ స్టార్ నటుడు మోహన్ లాల్ తో కూడా ఒక సినిమా చేసింది. ఇప్పుడు ఈ అమ్మడికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. అలాగే ఆమె వివిధ కార్యక్రమాలను అతిథిగా హాజరవుతుంది.
ఇది కూడా చదవండి: ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..