
ఒకానొకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు అమ్మ , అక్క, వదిన పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. స్టార్ హీరోలకు జోడీగా నటించిన ముద్దుగుమ్మలు చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడుచిరంజీవికి అక్కగా నటించిన ఈ నటి.. ఇప్పటికీ అందంలో అప్సరసే.. యంగ్ హీరోయిన్స్ కు పోటీ ఇచ్చేలా తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు కుర్ర హీరోయిన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? వెంకటేష్, నాగార్జునలాంటి హీరోలకు హీరోయిన్ గా చిరంజీవి అక్కగా నటించిన ఈ హీరోయిన్ ఎవరంటే..
ఇది కూడా చదవండి : Prabhas: ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. ఎమోష్నలైన ప్రభాస్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో ఖుష్బూ ఒకరు. ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాదు ఖుష్బూ అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఖుష్బూ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల భామ.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె. ఖుష్బూకు తెలుగుతో పాటు తమిళనాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఖుష్బూ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 54ఏళ్ల వయసులోనూ ఖుష్బూ తన అందంతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో 25 ఏళ్ల కుర్ర హీరోయిన్ గా మెరిశారు.
ఇది కూడా చదవండి :తమన్నాను చూసి కుళ్ళుకుంటున్న హాట్ బ్యూటీ.. అలాంటి పోస్ట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ సీరియస్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.