

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి అదే జిల్లా ఉటుకూరుకు చెందిన 22 ఏళ్ల యువతితో కుటుంబ సభ్యులు సంబంధం కుదుర్చారు. వివాహం చేసుకోవడానికి అక్కడి నుంచి అన్నవరం వచ్చారు. శనివారం ఉదయం దేవస్థానంలో పెళ్లిపీటలపై క్రతువు జరుగుతుండగా పెళ్లి కూతురు ఏడుస్తుండటాన్ని భక్తులు గుర్తించారు. కొందరు మహిళలు భద్రతా శిబ్బంది ఆమెను పక్కకు పిలిచి మాట్లాడగా పెద్ద వయసున్న వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని తనకు వివాహం అస్సలు ఇష్టం లేదని చెప్పింది. కనీసం పెళ్లి అని కూడా చెప్పకుండా తీసుకొచ్చారని బోరున విలపిస్తూ మెడలోని దండలు తీసిపడేసింది. సెక్యూరిటీ శిబ్బంది ఫిర్యాదు మేరకు పెళ్లి మండపానికి చేరుకున్న పోలీసులు వరుడు వెంకట అనంత దీక్షితులు పెళ్లికూతురు సుమతి కుటుంబ సభ్యులు బంధువులను స్టేషన్ కు తరలించారు. ఎస్సై సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఆలయంలో జరుగుతున్న ఈ బలవంతపు పెళ్లి భక్తులు శిబ్బంది చర్యతో నిలిచిపోయింది.