
మనలో చాలా మందికి టీ అలవాటు ఉంటుంది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఏ సమయంలోనైనా సరే టీ తాగేందుకు ఇష్టపడుతుంటారు చాలా మంది. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవారి నుంచి కాలేజీల్లో పిల్లల వరకు ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు రెండు మూడు సార్లైన టీ తాగుతుంటారు. టీ తాగడం వల్ల శరీరం అంత ఒక్కసారిగా యాక్టివేట్ అయిన ఫీల్ కలుగుతుంది. అంతేకాకుండా ఇది నీరసాన్ని కూడా పోగొట్టి అలసటను తగ్గిస్తుంది. రోజు ఉదయాన్నే టీ తాగడం వల్ల మెదడుకు చురుకుదనాన్ని అందించేందుకు సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అలాంటి టీ ఒక భారతీయులే కాకుండా ఇరాన్ తో పాటు అమెరికా ఇతర దేశాల ప్రజలు కూడా తాగుతున్నారు. అయితే, చాలామందికి భోజనం చేసిన తర్వాత కూడా టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది..? దీని వల్ల ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
భోజనం చేసిన తర్వాత టీ తాగడం కొంతవరకు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అన్నం తిన్న వెంటనే టీ తాగితే జీర్ణవ్యవస్థకు, పోషక పదార్థాల శోషణకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. టీలో ఉండే కొన్ని గుణాలు జీర్ణ క్రియపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా అన్నం తిన్న వెంటనే టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తీవ్రతరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీలో ఉండే టానిన్లు, కెఫీన్ వంటి రసాయనాలు జీర్ణ ప్రక్రియను మందగింపజేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు తిన్న తర్వాత వెంటనే టీ తాగడం మానుకోండి. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
భోజనం చేసిన వెంటనే టీ తాగితే.. అందులో ఉండే కెఫిన్ మెదడుపై ఒత్తిడి చూపే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల కొన్ని సమస్యలు రావచ్చు. కడుపులో ఆమ్లత పెరిగిఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే యాసిడిటీ, పొట్ట నొప్పి, జీర్ణక్రియ సమస్యలు ఉంటే అన్నం తిన్న తర్వాత టీ తాగడం మానుకోవడం చాలా మంచిది. టీలో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ ఎముకల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కెఫీన్ రక్తపోటును పెంచుతుంది. భోజనం తర్వాత టీ తాగితే నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..