
బీహార్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ముజఫర్‌పూర్‌లో CT స్కాన్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ యువకుడి పాలిట శాపంగా మారింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు సీటీ స్కాన్ చేయించుకున్నాడు. వచ్చిన రిపోర్ట్‌ను చూసి అతను షాక్ అయ్యాడు. ఆ రిపోర్టులో, అతని కడుపులో గర్భాశయం కనిపించింది. ఇందుకు సంబంధించిన రిపోర్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన SKMCHలో ఉన్న సిటీ స్కాన్ సెంటర్లో చోటు చేసుకుంది.
ముజఫర్‌పూర్‌లో ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల ఘనకార్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఆసుపత్రిలో కాలు విరిగితే, ప్లాస్టర్‌కు బదులుగా ఒక కార్టన్ కట్టి పంపించేశారు. ఇప్పుడు మరో షాకింగ్ టెస్ట్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. అక్కడ CT స్కాన్ కోసం వచ్చిన ఒక వ్యక్తిని ఏకంగా ఒక మహిళగా మార్చేస్తూ.. పరీక్ష రిపోర్ట్ ఇచ్చి పంపించారు. ఈ రిపోర్టును చూసిన వారంతా షాక్ అయ్యారు.
ముజఫర్‌పూర్‌లోని SKMCH వద్ద ఉన్న CT స్కాన్ కేంద్రంలో నిర్లక్ష్యానికి సంబంధించిన ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, గోయల్ బ్రదర్స్ MRI, CT స్కాన్ సెంటర్లో ఒక పురుష రోగికి CT స్కాన్ జరిగింది. ఇది PPP మోడ్‌లో నిర్వహించారు. రిపోర్టులో, పురుష అవయవాలకు బదులుగా, గర్భాశయం, అండాశయం వంటి స్త్రీ అవయవాలు ఉన్నట్లు ప్రస్తావించారు. ఇది చూసి రోగి షాక్ అయ్యాడు. అసలు విషయం ఆరా తీయడంతో CT స్కాన్ సెంటర్లో ఆ మహిళ మెడికల్ రిపోర్టులో ఒక పురుషుడి పేరు నమోదు చేయడమే అని తేలింది. రిపోర్టులో పేరు మార్పు కారణంగా, ఆ వ్యక్తి కడుపులో గర్భాశయం ఉన్నట్లు బయటపడింది.
కొద్దిసేపటిలోనే ఈ రిపోర్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నివేదిక చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, సిటీ స్కాన్ సెంటర్‌పై జనం విరుచుకుపడుతున్నారు. ప్రజలు రకరకాల విషయాలను చర్చించుకుంటున్నారు. అయితే, CT స్కాన్ ఆపరేటర్ రిపోర్టులో మహిళ పేరుకు బదులుగా పురుషుడి పేరు తప్పుగా ముద్రించినట్లు, దానిని సరిదిద్దామని చెప్పారు. అదే సమయంలో, తప్పుడు రిపోర్టు కారణంగా రోగి ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగిస్తుందని రోగి కుటుంబం ఆరోపించింది. ఈ సంఘటన ఆరోగ్య సేవల నాణ్యతపై అనుమానం వ్యక్తమవుతోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..