జబర్దస్త్లో తన యాంకరింగ్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న అనసూయ, సొగ్గాడే చిన్నినాయన సినిమాలో మెరిసి, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన, రంగస్థలం సినిమాలో ఛాన్స్ కొట్టేసి, ఈ మూవీలో రంగమత్తపాత్రలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.
