
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది కొవ్వు గడ్డల రూపంలో కనిపిస్తుంది. ఇవి మోకాళ్లు, మణికట్టు, మోచేతులు, పాదాలు, కండరాల చుట్టూ ఏర్పడతాయి.
కళ్ల చుట్టూ తెల్లని వలయం కనిపిస్తే అది నరాల్లో కొవ్వు పేరుకుపోయినట్లు సూచిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిన సంకేతం.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల ఛాతీలో తరచుగా నొప్పి కలుగుతుంది. ఇది గుండెపోటు ముప్పును సూచించవచ్చు.
కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే రక్త ప్రసరణ ప్రభావితమవుతుంది. దీని వల్ల కాలివేళ్లలో నొప్పి, బరువు అనుభూతి కలుగుతుంది.
తడబడటం లేదా నడకలో అసమతుల్యత కనిపిస్తే అది కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినట్లు సూచిస్తుంది.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల కంటి మీద పసుపు రంగులో కొవ్వు పొరలు ఏర్పడతాయి. ఇది ఒక హెచ్చరికగా పరిగణించాలి.
అనారోగ్యకరమైన ఆహారం తినడం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం వంటి అలవాట్లు ఉండడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ లు ఎక్కువగా ఉంటాయి.
ఆరోగ్యకరమైన ఆహారం తినడం, రోజువారీ వ్యాయామం చేయడం, కొలెస్ట్రాల్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం,
ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చు.