
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కుమ్మరగుంటకు చెందిన సుబ్రహ్మణ్యం కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని తరచూ పాములు కాటు వేస్తున్నాయి. అతనికి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొదటిసారి పాము కాటుకు గురైన సుబ్రహ్మణ్యం చికిత్స చేయించుకొని బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం వయస్సు 50 సంవత్సరాలు. కూలికి వెళ్తేకానీ ఇల్లుగడవని నిరుపేద కుటుంబం. ఇతడిని పగబట్టినట్టు పాములు తరచూ కాటు వేస్తుండటంతో వైద్యం చేయించుకోడానికి అతని కూలి సరిపోక అప్పుల పాలయ్యారు. సర్పదోషం ఉందేమోనని పూజలు కూడా చేయించారు. అయినా పాములు అతన్ని వదల్లేదు. ఊరు మారితేనైనా పాములు తనని వదిలేస్తాయేమోనని బెంగళూరుకు వలస వెళ్లిపోయారు. అక్కడ భవనిర్మాణపనులు, మట్టిపనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అక్కడ కూడా అతన్ని పాములు వదల్లేదు. తరచూ ఏదొక సందర్భంలో సుబ్రహ్మణ్యాన్ని పాములు కాటేస్తూనే ఉన్నాయి. లాభం లేదని మళ్లీ స్వగ్రామానికి కోళ్ల పరిశ్రమలో పనిలో చేరాడు. అప్పుడప్పుడూ పొలం పనులకు వెళ్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
గదిలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం వీడియో
తాచుపాము కరిచినా…10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో
ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో
తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో