దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పంజాబ్ లోని అటారి సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతోంది. దేశభక్తి గీతాలతో అటారి సరిహద్దు దద్దరిల్లింది. బీఎస్ఎఫ్ జవాన్ల కవాతు ఆకట్టుకుంది. ప్రతి రోజు వాఘా -అటారి సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరుగుతోంది. 1959 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే రిపబ్లిక్ డే నాడు జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
