
నిధి అగర్వాల్. బెంగుళూరుకు చెందిన ఈ అమ్మడు హైదరాబాద్ లోనే పెరిగింది. చదువు మధ్యలోనే నటనపై ఆసక్తితో మోడిలంగ్ రంగంలోకి అడుగుపెట్టింది.అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
సవ్యసాచి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిధికి సరైన గుర్తింపు రాలేదు.
ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. కానీ రెండోసారి సైతం ఆమెకు నిరాశ ఎదురైంది. ఆతర్వాత మంచి హిట్ అందుకుంది. అలాగే మజ్ను సినిమా తర్వాత గ్లామర్ గేట్లు ఎత్తేసింది ఈ బ్యూటీ.
కానీ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది. ఈ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జోడిగా రాజాసాబ్ చిత్రంలో కనిపించనుంది. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు చిత్రాల తర్వాత నిధి క్రేజ్ మారిపోనున్నట్లు తెలుస్తోంది.