
తేన్మల కేరళ : భారతదేశంలో పచ్చని అడవులు, తాడు వంతెలనలు, బూటింగ్, సీతాకోక చిలుకల పార్క్ , జింకల పార్క్, చెట్టుపై గుడిసెల నుంచి సంగీత ఫౌంటెన్లు ఇలా ఎన్నో ఉన్న తేన్మల హిల్ స్టేషన్ పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుందంట.
కోటగిరి, తమిళనాడు :ఊటీకి ప్రశాంతమైన బంధువు కోటగిరి. ఇది నీలగిరిలోని పురాతన హిల్ స్టేషన్. విశాలమైన టీ ఎస్టేట్లు, కేథరీన్ జలపాతం వంటి అందమైన ట్రెక్కింగ్‌లు అద్భుతమైన పర్వత ప్రయాణం చాలా ఆనందాన్ని ఇస్తుందంట. ఈ ప్రదేశం నుండి కొద్ది దూరంలో ఉన్న కేథరీన్ జలపాతం, ఎల్క్ జలపాతం, దొడ్డబెట్ట శ్రేణి, రంగస్వామి స్తంభం కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి.
వల్పరై, తమిళనాడు :అనామలై కొండలలో దాగి ఉన్న వల్పరై, టీ ప్రియులకు, వన్యప్రాణులను ఇష్టపడే వారికి ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. టీ యొక్క ఆకుపచ్చ తివాచీలు, పొగమంచుతో కూడిన రోడ్లు, రోడ్ ట్రిప్స్ తో ఈ హిల్ స్టేషన్ పర్యాటకులకు బెస్ట్ మెమోరీగా మారిపోతుంది.
పీర్మేడ్, కేరళ :సూఫీ సన్యాసి పీర్ మొహమ్మద్ పేరు మీద ఉన్నఈ హిల్ స్టేషన్ అంతగా ప్రసిద్ధి చెందలేదు. ఇడుక్కి జిల్లాలోని ఏలకులు, పైన్ అడవులతో సమృద్ధిగా ఉంది. వలసరాజ్యాల బంగ్లాలు, ప్రశాంతమైన తోటలతో, కేరళలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ల నుంచి ప్రశాంతమైన హిల్ స్టేషన్ సందర్శించాలి అనుకునే వారికి ఇది గొప్ప ఎంపిక.
కొల్లి కొండలు, తమిళనాడు :చల్లటి వాతావరణం, పచ్చని చెట్లు, కొండలు జలపాతాలు, పురాతన ఋషుల ఇతిహాసాలతో కూడిన కొల్లి కొండలు ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. సమ్మర్ లో గనుక ఇక్కడికి వెళ్తే చాలా ఎంజాయ్ చేయవచ్చునంట.