మన దేశంలో సొంత ఇల్లు కలిగి ఉండటం ఒక గౌరవంగా, భద్రతగా భావిస్తారు. ఎంతైనా మనిల్లు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో నగరాల్లో సొంత ఇల్లు కలిగి ఉండటం చాలా మందికి ఒక పెద్ద కలగా మారింది. ఇల్లు కొనడం అనేక కారణాల వల్ల సవాలుతో కూడుకున్నది. వాటిలో పెరుగుతున్న ఆస్తి ధరలు ఒకటి. దీనివల్ల ప్రజలు గృహ రుణాలపై ఆధారపడవలసి వస్తుంది. మరి అలా హోమ్ లోన్ కోసం చూస్తున్నారో వారికి తక్కువ వడ్డీకి హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకుల గురించి కాస్త అవగాహన ఉండటం ఎంతైన మంచిది.
హోమ్ లోన్ విషయంతో వడ్డీ రేట్లలో స్వల్ప తేడా ఉన్నా.. అది ఈఎంఐని పెంచడమే కాక.. మొత్తం లోన్ అమౌంట్ను కూడా భారీగా పెంచేస్తోంది. లోన్ తీసుకున్న వారికి అలాంటి భారం ఉండొద్దంటే.. తక్కువ వడ్డీకి హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఏమో తెలుసుకోవడం ఉత్తమం. మరి తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తున్న టాప్ పీఎస్యూ బ్యాంకులు ఏవో ఇప్పుడు చూద్దాం..
అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీకి గృహ రుణాలను అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ తక్కువ వడ్డీకే హోమ్ లోన్లు అందిస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.10 శాతం ప్రారంభ వడ్డీ రేటుకు గృహ రుణాలను అందిస్తోంది. ఒక కస్టమర్ రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు రుణం తీసుకుంటే, వడ్డీ రేటు 7.10 నుండి 10.00 శాతం వరకు ఉంటుంది. ఎవరైనా రూ.75 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాన్ని తీసుకుంటే బ్యాంక్ 7.10 నుండి 10.25 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తోంది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 7.10 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో రుణాలు పొందవచ్చు. తక్కువ EMI లతో ఎక్కువ కాలం ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్లు దీనిని పరిగణించవచ్చు. రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల కంటే ఎక్కువ గృహ రుణాలకు 7.10 నుండి 9.15 శాతం వడ్డీ రేటు ఉంటుంది. అంటే రుణ మొత్తంతో సంబంధం లేకుండా ప్రారంభ రేటు చాలా తక్కువగా ఉంటుంది.
యూకో బ్యాంక్ 7.15 నుండి 9.25 శాతం వడ్డీ రేటుతో రూ.30 లక్షల నుండి రూ.75 లక్షల వరకు గృహ రుణాలను అందిస్తుంది. స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఈ రేట్లు ఇప్పటికీ ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విషయానికి వస్తే, గృహ రుణాలను 7.10 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో అందిస్తుంది. ఈ బ్యాంకులో అన్ని వర్గాల రుణాలకు వడ్డీ రేటు 7.10, 9.90 శాతం మధ్య ఉంటుంది.
ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వస్తే.. HDFC బ్యాంక్ 7.90 శాతం ప్రారంభ వడ్డీ రేటుకు గృహ రుణాలను అందిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ గృహ రుణాలను విస్తరిస్తోంది, వడ్డీ రేట్లు 7.65 శాతం నుండి ప్రారంభమవుతాయి. యాక్సిస్ బ్యాంక్లో గృహ రుణాలకు ప్రారంభ వడ్డీ రేటు దాదాపు 8.35 శాతంగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
