మరోవైపు సైఫ్ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించినట్టు చెబుతున్నారు. అప్పటికే సైఫ్ చిన్న కుమారుడు గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి కేకలు వేసి అలారం మోగించింది. ఈ శబ్దాలు విని మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే సైఫ్‌ను కత్తితో విచక్షణారహితంగా నిందితుడు పొడిచాడు.గురువారం తెల్లవారుజామున రెండున్నరకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ఆ తర్వాత ఆయన్ను ముంబై లీలావతి ఆస్పత్రికి తరలించారు. దుండగుడు పారిపోయిన CCTV దృశ్యాలను పరిశీలిస్తున్నారు. 20కి పైగా పోలీసు బృందాలు అతడి కోసం గాలిస్తున్నాయి. చివరకు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అనుమానితుడికి ఎలాంటి సంబంధం లేదని తేలినట్లు పోలీసులు దృవీకరించారు.
మరిన్ని వీడియోల కోసం :
సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే?
