సెప్టెంబర్ 19నాటి అమెరికా అధ్యక్షుడి ఉత్తర్వులకు సడలింపులు ఇస్తున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకటించింది. అమెరికా బయట చదువుకుని H-1B వీసాలకు దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేసింది. జాతీయ మీడియా నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునారా మాట్లాడుతూ.. F-1, L-1 వీసా లబ్ధిదారులు ఈ భారీ ఫీజు నుంచి విముక్తి పొందారని తెలిపారు. ఇది విదేశీ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపశమనం కలిగించే నిర్ణయమని అన్నారు. ఈ మార్పులు అమెరికాలో ఉన్న ఉద్యోగదారులకు, అలాగే విద్యార్థులకు.. ఇమ్మిగ్రేషన్ ఖర్చులను తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2026వ సంవత్సరానికి H-1B వీసా తీసుకోవాలంటే లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలని ట్రంప్ గతనెల ప్రకటించారు. దీంతో కంపెనీలు, గ్రాడ్యుయేట్ల గుండెల్లో రాయిపడింది. ఈ భారీ ఫీజులపై ఆందోళన వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకటించిన కొత్త మినహాయింపులు భారతీయ విద్యార్థులకు ఊరట కల్పిస్తాయని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్‌లో పెట్రోల్ కొట్టించుకున్నాడు.. అర కిలోమీటరు వెళ్లగానే
రైల్వే స్టేషన్లో ఏదైనా కొంటున్నారా ?? ఇలా కాలర్ పట్టుకుంటారు జాగ్రత్త
మోనాలిసా కొలువైన మ్యూజియంలో.. మహా దోపిడీ
మర్యాదగా ఒప్పుకో.. లేదంటే లేపేస్తాడు జెలెన్ స్కీకి ట్రంప్ వార్నింగ్
ఆ చెట్టు ఆకుల్లో బంగారం.. నిర్ధారించిన ఫిన్‌ల్యాండ్ శాస్త్రవేత్తలు
