
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చోట రైలు కొద్ది క్షణాలు ఆగింది. అందులో ఓ బోగీలోని ప్రయాణికుడు విండో పక్కగా కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు. అది గమనించిన ఓ దొంగ అతని ఫోన్ కొట్టేయాలనుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగి అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నాడు. అలర్టయిన ఆ ప్రయాణికుడు ఆ దొంగ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో రైలు కదిలిపోయింది. అయినా ఆ ప్రయాణికుడు దొంగను వదల్లేదు. రైలు ముందుకు దూసుకెళ్తోంది.. దొంగ రైలుకి వేళాడుతూనే ఉన్నాడు. దొంగను పట్టుకున్న ప్రయాణికుడు అతన్ని తలపై కొడుతూనే ఉన్నాడు. ఓ వైపు వదిలించుకుని పారిపోదామా అంటే రైలు వేగంగా దూసుకెళ్తోంది. కిందపడితే ప్రాణాలు పోతాయి.. దానికన్నా వీడిచేతిలో దెబ్బలుతిని ప్రాణాలు కాపాడుకోవడం బెటరనుకొని అలాగే ఉండిపోయాడు దొంగ. అలా దొంగకి చుక్కలు చూపించాడు ప్రయాణికుడు. ఇంతలో రైలు స్లో అవడంతో.. కొంతమంది యువకులు వచ్చి ఆ దొంగను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఫోన్ కోసం ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడని వాపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బురదలో సేదతీరుతున్న దున్నపోతు.. వీపుపై తట్టిలేపిన సింహం
ఇకపై మీ ఇంటికే పెట్రోల్.. బంకుల దగ్గర క్యూ అక్కర్లేదు..
ఆర్ఆర్ఆర్ సెంటిమెంట్.. ఎస్ఎస్ఎంబీ 29 రిలీజ్ అప్పుడే..!
kalyan Ram: తమ్ముడు బక్కచిక్కిపోతే.. అన్నకు ప్రశ్నేంటి?
అమానవీయం.. పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థినికి క్లాస్ రూమ్ బయట పరీక్ష!