

వంటింట్లో ప్రతి రోజూ ఉపయోగించే ప్రధాన పదార్థం ఉప్పు. గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉప్పు నీటితో గార్గిల్ చేయడం వల్ల గొంతులో ఉన్న బ్యాక్టీరియా తొలగించి గొంతు సమస్యలు తగ్గుతాయి. ముక్కు, గొంతు సమస్యలు కలిగితే ఉప్పు నీరును బాగా పుక్కిలించడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
తులసి ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఈ ఆకులలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తాజా తులసి ఆకులను నమిలితే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అదనంగా తులసి ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రోజువారీ జీవన విధానంలో తులసి ఆకులను తమ ఆహారంలో చేర్చడం ఆరోగ్యానికి మంచిది.
నిమ్మరసంలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచే సహజ శక్తి కలిగివుంది. నిమ్మరసం తాగడం వల్ల శరీరాన్ని డీటాక్స్ చేయవచ్చు.. తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో మిగిలిపోయే హానికరమైన టాక్సిన్స్ బయటకు తొలగిపోవడమే కాదు.. రోగనిరోధక శక్తి మెరుగుపడటానికి కూడా ఇది సహాయపడుతుంది.
అల్లం అనేది వంటింట్లో చాలా ఉపయోగకరమైన పదార్థం. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఇది జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే అల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. అల్లం వాడటం వల్ల జీర్ణక్రియ కూడా సులభం అవుతుంది.
తేనె గొంతు నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని గాయాలను త్వరగా మానిపించడంలో కూడా బాగా పనిచేస్తుంది. తేనెలో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. వీటితో మన శరీరంలోని ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. అదనంగా తేనె శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థను పెంచడానికి కూడా సహాయపడుతుంది.
ఉల్లిపాయలు సహజ యాంటీబయోటిక్స్ గా పనిచేస్తాయి. వీటిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలను సర్వింగ్ సమయంలో ఆహారంలో చేర్చడం ద్వారా శ్వాస సంబంధిత సమస్యలు, వాపు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వంటకాల్లో ఉల్లిపాయలను చేర్చడం ఆరోగ్యానికి మంచిది.
పసుపు లోని కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఒక బలమైన యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో ఉంటుంది. పసుపు ద్వారా శరీరంలోని జీర్ణ శక్తిని పెంచుకోవచ్చు. పసుపు కలిపిన పాలు తీసుకోవడం వల్ల శరీరంలోని బాక్టీరియా, వైరస్ ను నిర్మూలించి శరీరానికి కావలసిన పోషకాలు అందిస్తుంది.
వెల్లుల్లి కూడా సహజ యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి అనేక రకాల ఫంగస్, వైరస్ నుండి రక్షణను అందిస్తుంది. వెల్లుల్లి వినియోగించడం ద్వారా ఇమ్యూనిటీ పెరిగి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది.
ఈ సహజ యాంటీబయోటిక్స్ అనేవి మనం వంటింట్లో ప్రతి రోజు ఉపయోగించే పదార్థాలే అయినప్పటికీ.. వాటి ఆరోగ్య ప్రయోజనాలు విస్తృతంగా ఉంటాయి. యాంటీబయోటిక్ గుణాలు ఉన్న ఆహారాలు మన శరీరాన్ని అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి కాపాడడంలో సహాయపడతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)